దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం | Employees fraud in vijayawada kanakadurga temple | Sakshi
Sakshi News home page

దుర్గ గుడిలో సిబ్బంది చేతివాటం

Dec 18 2017 1:29 PM | Updated on Dec 18 2017 1:29 PM

సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. భక్తులు వినియోగించిన టిక్కెట్లను సోమవారం తిరిగి మరోసారి భక్తులకు ఇచ్చి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన భక్తులు ఆలయ సిబ్బందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ఇది తొలిసారి కాదు. అనేక విషయాల్లో ఆలయంలో పనిచేస్తున్న కొందరు అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తరుచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement