జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు జరిమానా | German Football Federation fined | Sakshi
Sakshi News home page

జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు జరిమానా

Jun 26 2025 2:39 AM | Updated on Jun 26 2025 2:39 AM

German Football Federation fined

2006 ప్రపంచకప్‌ పన్ను ఎగవేత కేసులో తీర్పు

బెర్లిన్‌: జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 ప్రపంచకప్‌ పన్ను ఎగవేత కేసులో జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు జరిమానా పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఫ్రాంక్‌ఫర్ట్‌ స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పన్ను ఎగవేతకు పాల్పడిన జర్మనీకి 1,28,000 డాలర్లు (రూ. 1 కోటీ 10 లక్షలు) జరిమానా విధించింది. ప్రపంచకప్‌ ప్రారంభానికి ఒక ఏడాది ముందు అంటే 2005లో ‘ఫిఫా’ నిర్దేశించిన పన్నులు చెల్లించడంలో జర్మనీ విఫలమైంది.

దీంతో జరిమానా భారీ మొత్తంలో ఉండాలని ‘ఫిఫా’ తరఫున న్యాయవాదులు పట్టుబట్టారు. ప్రపంచకప్‌ ప్రారంబోత్సవం కోసం తీసుకున్న రుణాన్ని దాచిపెట్టిన జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య.. ఓ ఏడాది తర్వాత దాన్ని వ్యాపార ఖర్చుగా తప్పుగా వెల్లడించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. 

ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రతినిధులు జ్వాన్జిగర్, వోల్ఫ్‌గ్యాంగ్, నీర్స్‌బాచ్, హోర్ట్స్‌ స్మిత్‌లపై తొలుత విచారణ సమయంలో అభియోగాలు మోపారు. వాటిని ఖండించిన ఈ ముగ్గురూ జరిమానాలు చెల్లించిన తర్వాత వారిపై వేసిన విచారణలను రద్దు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement