చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్‌.. తొలి ఇండియన్‌గా రికార్డు | FIFA World Cup 2026 Qualifier: India To Take On Afghanistan In Sunil Chhetri 150th Game, Know Details - Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026 Qualifier: చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్‌.. తొలి ఇండియన్‌గా రికార్డు

Mar 26 2024 8:52 AM | Updated on Mar 26 2024 10:09 AM

FIFA World Cup 2026 Qualifier: India To Take On Afghanistan In Sunil Chhetri 150th Game - Sakshi

నేడు ఆఫ్గానిస్తాన్‌తో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌

గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్‌

భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి 150వ మ్యాచ్‌ 

గువాహటి: భారత ఫుట్‌బాల్‌ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయిర్స్‌లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్‌ హోం మ్యాచ్‌ ఒక్క గోల్‌ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్‌ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్‌ 18 చానెల్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన సునీల్‌ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 93 గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement