శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’  | I League National Football Tourney: Sreenidi Deccan Draws Match With Mohammedan Sporting Club | Sakshi
Sakshi News home page

I League National Football Tourney: శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’ 

Mar 1 2024 10:35 AM | Updated on Mar 1 2024 10:35 AM

I League National Football Tourney: Sreenidi Deccan Draws Match With Mohammedan Sporting Club - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐ–లీగ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నీలో శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. లీగ్‌ ‘టాపర్‌’ మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది.

ఆట మూడో నిమిషంలో డేవిడ్‌ కాస్టనెడా గోల్‌తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 84వ నిమిషంలో మొహమ్మద్‌ జాసిమ్‌ గోల్‌తో మొహమ్మదాన్‌ స్పోర్లింగ్‌ క్లబ్‌ స్కోరును సమం చేసింది. రెండు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

ప్రస్తుతం మొహమ్మదాన్‌ స్పోర్లింగ్‌ క్లబ్‌ 35 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... శ్రీనిధి డెక్కన్‌ జట్టు 33 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement