-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మ్యాచ్ ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. లీగ్ ‘టాపర్’ మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట మూడో నిమిషంలో డేవిడ్ కాస్టనెడా గోల్‌తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 84వ నిమిషంలో మొహమ్మద్ జాసిమ్ గోల్‌తో మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ స్కోరును సమం చేసింది. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ 35 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... శ్రీనిధి డెక్కన్ జట్టు 33 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
దిలీప్ కుమార్@ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని
న్యూఢిల్లీ: తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌కు వ్యక్తిగతంగా క్రీడలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్‌బాల్ అంటే పడి చచ్చే ఆయన ప్రఖ్యాత మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్‌కు వీరాభిమాని. ఆ జట్టు కోల్‌కతాలో ఆడినా, ముంబైలో ఆడినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారని హైదరాబాద్‌కు చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్ గుర్తు చేసుకున్నారు. రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ తదితర పెద్ద టోర్నీల మ్యాచ్‌లకు వెళ్లి దిలీప్ మ్యాచ్‌లను ఆస్వాదించేవారు. ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన గురించి అమల్‌రాజ్ చెప్పారు. ‘ఫుట్‌బాల్ అంటే బాగా ఇష్టం కాబట్టి 1980 రోవర్స్ కప్ ఫైనల్‌కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టడం దిలీప్‌కు కోపం తెప్పించింది. దిలీప్ మొహమ్మదాన్కు అభిమాని కాగా... ఈస్ట్ బెంగాల్ అభిమానులు ఆ సమయంలో సూపర్ హిట్ సినిమా అయిన ‘మర్యాద’ హీరో రాజ్‌కుమార్ పేరుతో గొడవ చేస్తుండటంతో ఆయననే అతిథిగా పిలవాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయిన దిలీప్ కుమార్‌ను కలవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం’ అని అమల్‌రాజ్ అన్నారు. మరో ప్రముఖ ఆటగాడు చున్నీ గోస్వామి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఆయనను ఒప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో కూడా దిలీప్ కుమార్ కీలకపాత్ర పోషించారు. దిలీప్‌జీ... మీలాంటి మరో వ్యక్తి ఎప్పటికీ రాలేరు. భారత సినిమాకు మీరు చేసిన సేవ అసమానం. –సచిన్ టెండూల్కర్ భిన్న తరాలు ప్రేమించిన ఒక దిగ్గజం ఇవాళ కన్నుమూశారు. దిలీప్సాబ్కు నా నివాళి. – కోహ్లి దిలీప్‌గారే చెప్పినట్లుగా ప్రపంచంలో ఎన్నో విషయాలు మారిపోయినా అందరినీ ప్రేమించే మనసున్నవారు ఎప్పటికీ మారిపోరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీరేంద్ర సెహ్వాగ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement