కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి | Five Year Old Oirl Incident In Karnataka | Sakshi
Sakshi News home page

కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి

Dec 20 2025 7:51 AM | Updated on Dec 20 2025 7:52 AM

Five Year Old Oirl Incident In Karnataka

కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్‌బాల్‌ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్‌లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్‌ అనే వ్యక్తి కాలితో తన్నాడు. 

దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్‌(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement