అర్జెంటీనాకు షాక్‌ | A shock to Argentina | Sakshi
Sakshi News home page

అర్జెంటీనాకు షాక్‌

Jul 25 2024 3:53 AM | Updated on Jul 25 2024 9:49 AM

A shock to Argentina

సెయింట్‌ ఎటిన్‌ (ఫ్రాన్స్‌): పారిస్‌ ఒలింపిక్స్‌ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్‌ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్‌ మ్యాచ్‌లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. 

ఇంజ్యూరీ టైమ్‌లో అర్జెంటీనా చేసిన గోల్‌ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్‌ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్‌ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్‌ సైడ్‌గా పరిగణించి గోల్‌ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement