ఐఎఫ్ఏ టైటిల్‌ నిలబెట్టుకున్న మోహన్‌ బగాన్‌ | Mohun Bagan Beat east Bengal To Defend IFA Shield Title | Sakshi
Sakshi News home page

ఐఎఫ్ఏ టైటిల్‌ నిలబెట్టుకున్న మోహన్‌ బగాన్‌

Oct 8 2026 9:20 PM | Updated on Oct 8 2026 9:20 PM

Mohun Bagan Beat east Bengal To Defend IFA Shield Title

source: X

ఐఎఫ్ఏ షీల్డ్ 2026 టైటిల్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ నిలబెట్టుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఇవాళ జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఈస్ట్ బెంగాల్‌ను 1-0తో ఓడించి విజేతగా నిలిచింది.  ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయంలో సమీర్ జెల్జ్‌కోవిచ్ చేసిన గోల్ మోహన్ బగాన్‌కు విజయాన్ని అందించింది. 

సహల్ అబ్దుల్ సమద్ అందించిన అద్భుతమైన పాస్‌ను జెల్జ్‌కోవిచ్ ఛాతితో నియంత్రించి.. గోల్‌కీపర్‌ను తప్పిస్తూ ప్రశాంతంగా బంతిని నెట్‌లోకి పంపాడు. 45వ నిమిషంలో నమోదైన ఈ గోలే మోహన్‌ బగాన్‌ను విజేతగా నిలిపింది. రెండో అర్ధభాగంలో ఈస్ట్ బెంగాల్ గోల్ కోసం ప్రయత్నించినా.. మోహన్ బగాన్ రక్షణను ఛేదించలేకపోయింది.

22వసారి టైటిల్
ఈ విజయంతో మోహన్ బగాన్ 22వసారి ఐఎఫ్ఏ షీల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే సీజన్‌లో కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ (CFL), ఐఎఫ్ఏ షీల్డ్ టైటిళ్లను గెలిచిన ఘనత కూడా సాధించింది.

ఇదీ చదవండి: విండీస్‌తో రెండో టీ20కి ముందు వైభవ్‌ విధ్వంసం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement