breaking news
Mohan Bagan football team
-
ఎంపికైంది 35 ... హాజరైంది 25!.. కోచ్ ఏమన్నాడంటే..
బెంగళూరు: నేషన్స్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ శిబిరానికి మొత్తం 35 మంది ప్లేయర్లు ఎంపిక కాగా... 16 నుంచి బెంగళూరులో శిక్షణ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 25 మంది ప్లేయర్లు మాత్రమే శిక్షణలో పాల్గొంటున్నారు. మరో 11 మంది ఆటగాళ్లు ఇంకా శిబిరంలో చేరాల్సి ఉంది. జాతీయ శిబిరానికి ఎంపికైన ప్లేయర్లలో ఏడుగురు ఆటగాళ్లు... డ్యురాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆ ఏడుగురు ఎవరంటే?ఈ ఏడుగురిని ఆ క్లబ్ ఇంకా విడుదల చేయకపోవడంతో... అనిరుధ్ థాపా, దీపక్, రాల్టె, లిస్టన్ కొలాకో, మాన్వీర్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, విశాల్ జాతీయ శిబిరంలో పాల్గొనలేకపోతున్నారు. నేషన్స్ కప్‌లో భాగంగా ఈ నెల 29న భారత జట్టు తజకిస్తాన్‌తో పోటీపడాల్సి ఉంది. అయితే నేషన్స్ కప్ ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భాగం కాకపోవడంతో... నిబంధనల ప్రకారం ప్లేయర్లను విడుదల చేయాల్సిన అవసరం లేదు.డ్యురాండ్ కప్‌లో భాగంగా ఈ నెల 17న జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే మోహన్ బగాన్ పరాజయం పాలై... టోర్నీ నుంచి వైదొలిగినా ఇప్పటి వరకు ఆటగాళ్లను మాత్రం జాతీయ శిబిరానికి పంపలేదు. ఈ టోర్నీ సెమీస్‌లో ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టులోనూ శిబిరానికి ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లు అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ ఉండగా... వాళ్లు కూడా ఇప్పటి వరకు క్యాంప్‌లో అడుగు పెట్టలేదు.కోచ్ ఏమన్నాడంటే..ఈ నేపథ్యంలో కొత్త కోచ్ జమీల్ మాట్లాడుతూ... ‘ఆటగాళ్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం కొనసాగుతోంది. మరింత మంది ప్లేయర్లను పరీక్షిస్తాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతాం’ అని అన్నాడు.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాశిబిరంలో పాల్గొంటున్న మాన్వీర్ మాట్లాడుతూ... ‘గత ఆరేళ్లుగా జాతీయ జట్టు జెర్సీ వేసుకోవాలని ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు ఇప్పు డు అవకాశం వచి్చంది. అండర్–19 స్థాయిలో 2019లో ఏఎఫ్సీ అండర్–19 ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. భారత జట్టుకు స్ట్రయికర్ స్థానంలో ఆడటం చాలా కష్టం. కోచ్ జమీల్ ఆధ్వర్యంలో గతంలో మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాలు కోచ్‌కు తెలుసు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నాడు. -
కొత్త హెడ్‌కోచ్.. భారత జట్టు దశ మారేనా?.. పెను సవాళ్లకు సిద్ధం
మిడ్‌ఫీల్డర్‌గా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఖాలిద్ జమీల్ తదనంతం కోచ్‌గా క్లబ్ జట్లపై ప్రభావం చూపాడు. అరకొర నిధులతో సరిపెట్టినా జట్టును మేటిగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. అలా తక్కువ బడ్జెట్లో విజయవంతమైన కోచ్‌గా నిరూపించుకున్నాడు. అందుబాటులో ఉన్న రూ. 2 కోట్ల నిధులతో 2016–17 సీజన్ ఐ–లీగ్‌లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)ని విజేతగా నిలబెట్టాడు. అదే విధంగా.. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, ముంబై ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్, జంషెడ్పూర్ ఎఫ్‌సీ క్లబ్‌లకు కోచ్‌గా సేవలందించాడు. ఇక ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ప్లేఆఫ్‌కు చేర్చిన తొలి భారత కోచ్‌గా జమీల్దే ఘనత! తాజాగా మనొలో (స్పెయిన్) స్థానంలో భారత హెడ్ కోచ్‌గా నియమితుడైన 49 ఏళ్ల ఖాలిద్ తొలిసారిగా ఓ అంతర్జాతీయ జట్టుకు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. జమీల్‌కు కలిసొచ్చిందిలా... చాలా ఏళ్లుగా క్లబ్, ఫ్రాంచైజీ జట్లకు కోచింగ్ ఇచ్చిన ఖాలిద్ జమీల్‌కు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి నియామకం. అయితే ఇదేమీ గాలివాటంగా రాలేదు. ఇండియా లీగ్ (ఐ–లీగ్)లో ప్లేయర్‌గా విజయవంతమయ్యాడు. 2005లో మహీంద్ర యునైటెడ్ విజేత జట్టు సభ్యుడైన జమీల్ తదనంతరం మేనేజర్‌గా ఐజ్వాల్ ఎఫ్‌సీ తరఫున కమాల్ చేశాడు. ఐజ్వాల్‌ను విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర ఖాలిద్దే!కేవలం పరిమిత నిధులతోనే తక్కువ బడ్జెట్లోనే జట్టును విజయపథాన నిలిపాడు. ఆ తర్వాత ముంబై ఎఫ్సీకి కోచ్‌గా వెళ్లాడు. తదనంతరం ఐఎస్ఎల్లో నార్త్ఈస్ట్ యునైటెడ్‌ను సెమీఫైనల్ చేర్చిన కోచ్‌గా పేరు తెచ్చుకున్నాడు. జంషెడ్పూర్ ఎఫ్‌సీ కోచ్‌గాను పనిచేశాడు. టైటిళ్లు సాధించకపోయిన జట్టును సానబెట్టిన తీరుతో ఏఐఎఫ్ఎఫ్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’గా రెండు సీజన్లపాటు అవార్డు గెలుచుకున్నాడు. ఇవన్నీ కూడా టీమిండియా కోచ్ అయ్యేందుకు సోపానంలా పనిచేశాయి.అద్భుతాలు కాదు... కానీ! ఇప్పటికిప్పుడు జమీల్ నుంచి అద్భుతాలను ఆశించడమంటే అది అత్యాశే అవుతుంది. అయితే ఆచరణీయ సాధన సంపత్తితో జట్టును తీర్చిదిద్దుతాడని గత ఫలితాలను బట్టి చెప్పొచ్చు. స్వయంగా ప్లేయర్ అయిన ఖాలిద్ జట్టు లోటుపాట్లపై తక్షణం విశ్లేషించగలడు. డిఫెన్స్ వైఫల్యంతో ఇటీవల దిగువ ర్యాంక్ జట్లతోనూ ఓడిన భారత్ జట్టును ఓ మెట్టుపైనే నిలబెట్టేందుకు తన వంతు కృషి చేయగలడు. డిఫెన్స్, ఫార్వర్డ్‌లపై తనకున్న అపారమైన అనుభవం జట్టుకు మేలు చేస్తుంది.ముఖ్యంగా ఆటగాళ్లపై వ్యక్తిగత శ్రద్ద పెట్టి తీర్చిదిద్దే సామర్థ్యం అతనిలో ఉంది. సీనియర్లు, యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించే నైపుణ్యం జమీల్లో ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒక్క సిరీస్‌తో, ఒక్క ఏడాదితో జరిగేది కాదు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కొత్త కోచ్‌కు తగినంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు చేరాలంటే మాత్రం ప్రణాళికబద్ధంగా శ్రమించాలి. కాబట్టి కోచ్‌గా కుదిరేందుకు, జట్టును మార్చేందుకు కచ్చితంగా సమయం పడుతుంది. పెను సవాళ్లకు సిద్ధం భారత కోచ్ పదవి కోసం సుమారు 170 మంది పోటీపడ్డారు. వీరిలో పేరున్న విదేశీ కోచ్‌లు కూడా ఉన్నారు. వారందరిని వెనక్కినెట్టిన ఖాలిద్ జమీల్ కొత్త హెడ్ కోచ్ అయ్యాడు. 2011–2012 తర్వాత స్వదేశీ కోచ్ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే జమీల్ ముందున్న సవాళ్లపై దృష్టి పెట్టాడు. ఈ నెలలోనే సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ జరుగనుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే టోర్నీతో టీమిండియాకు అతని కోచింగ్ మొదలవుతుంది.తజికిస్తాన్‌తో జరిగే తొలిపోరులో భారత్ సాధించే సానుకూల ఫలితం అతన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించనుంది. ఇటీవల హాంకాంగ్ చేతిలో 0–1తో ఓడిపోయిన భారత్... 2027 ఆసియా కప్ రేసులో ఉండాలంటే సింగపూర్‌తో తదుపరి జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. తద్వారా ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకేందుకు అవకాశముంటుంది. ఇంటాబయటా జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, ఆసియా క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్ రాణించాలంటే వెంటనే చేయాల్సింది సమీక్ష ఆ తర్వాతే సన్నద్ధతపై పూర్తి అవగాహన వస్తుంది. తన శిష్యులకు కలిసొచ్చేనా... సుదీర్ఘ కాలంపాటు క్లబ్, ఫ్రాంచైజీ జట్లతో ఉన్న అనుబంధంతో ఎంతో మంది శిష్యులు జతయ్యారు. వీరిలో అపూయా రాల్తే, సందేశ్ జింగాన్, మో సనన్‌లతో ఖాలిద్‌కు చక్కని బంధమేర్పడింది. ఇప్పుడు వీరందరికి అనుకూలమైన కోచ్ రావడం కాస్త అనుకూలించనుంది. నార్త్ఈస్ట్, జంషెడ్పూర్, ముంబై ఎఫ్‌సీ ఇలా క్లబ్ జట్లలో విశేషంగా రాణించిన వారికి తప్పకుండా భారత జట్టులో చోటు లభిస్తుంది. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చే కోచ్ వల్ల తప్పకుండా కుర్రాళ్లకు కలిసిరానుంది. భారత జట్టు కోసం తన దృష్టిలో ఉన్న కోర్ గ్రూప్ ప్లేయర్లను సానబెడతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. తద్వారా జమీల్ జట్టులో తన ‘మార్క్’ చూపించే ప్రయత్నమైతే గట్టిగానే చేస్తాడు. -సాక్షి క్రీడా విభాగం -
LSG VS KKR: లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది. మే 20న కేకేఆర్‌తో జరగబోయే తమ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో కృనాల్ అండ్ కో ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఎల్ఎస్జీకి యజమాని అయిన సంజీవ్ గొయెంకా కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఛాంపియన్ మోహన్ బగాన్ ఫ్రాంచైజ్‌కు కూడా ప్రధాన వాటాదారు కావడంతో ఐఎస్ఎల్ ఛాంపియన్లకు ప్రత్యేక నివాళులర్పించేందుకు ప్రత్యేక జెర్సీని ధరించనున్నట్లు ఎల్ఎస్జీ యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్ అందాజ్.. ఇప్పుడు కోల్‌కతా రంగుల్లో అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ మోహన్ బగాన్ మరియు సిటీ ఆఫ్ జాయ్ (కోల్‌కతా)కు ప్రత్యేక నివాళి అని పేర్కొంది. కేకేఆర్ అభిమానుల మద్దతు కోసం.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీని ధరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 నుంచి కేకేఆర్ దాదాపుగా నిష్క్రమించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులను తమవైపు మళ్లించేందుకు ఎల్ఎస్జీ జెర్సీ మార్పునకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ధోని ఈడెన్ గార్డెన్స్‌లో (ఈ సీజన్లో) ఆడినప్పుడు, అతని గౌరవార్ధం (ఆఖరి సీజన్ అన్న ఉద్దేశంతో) కేకేఆర్ అభిమానులు పసుపు రంగు జెర్సీలు ధరించి స్టేడియంలో హంగామా చేసిన వైనాన్ని మైండ్‌లో పెట్టుకుని ఎల్ఎస్జీ యాజమాన్యం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చు. ఏటీకే మోహన్ బగాన్ ఇకపై మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్.. గత ఐఎస్ఎల్ సీజన్ ఫైనల్లో సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని మోహన్ బగాన్ (మునుపటి ఏటీకే మోహన్ బగాన్) జట్టు బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మోహన్ బగాన్ ఈ సీజన్ ఛాంపియన్‌గా అవతరించిన అనంతరం గొయెంకా.. తన జట్టు పేరును మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌గా మార్చాడు. వచ్చే సీజన్‌ను తాము ఇదే పేరుతో బరిలోకి దిగుతామని ప్రకటించాడు. చదవండి: భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్..? -
ISL 2023: సెమీస్‌లో ముగిసిన హైదరాబాద్ ఎఫ్‌సీ పోరాటం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. సోమవారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ కూడా తొలి సెమీఫైనల్ మాదిరిగానే 0–0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు. ‘షూటౌట్’లో మోహన్ బగాన్ 4–3తో హైదరాబాద్‌ను ఓడించింది. షూటౌట్లో హైదరాబాద్ తరఫున జావో, డాను, రీగన్ సఫలంకాగా... సివెరియో, ఒగ్బెచె విఫల మయ్యారు. ఈనెల 18న గోవాలో జరిగే ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీతో మోహన్ బగాన్ ఆడుతుంది. -
బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా
Ganguly Quits ATK Mohun Bagan Director Position: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి బుధవారం(అక్టోబర్ 27) రాజీనామా చేశాడు. ఐపీఎల్లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న RPSG గ్రూప్ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు గంగూలీ డైరెక్టర్ మాత్రమే కాదు..షేర్ హోల్డర్ కూడా. కాగా, RPSG గ్రూప్ లక్నో జట్టును రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ రెండు జట్ల చేరకతో ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
మోహన్ బగాన్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ‘నాస్డాక్’ బిల్‌బోర్డులపై క్లబ్ లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్డాక్’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్ బగాన్ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది. తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్ బగాన్ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్ చేసింది. -
ఫుట్‌బాల్ జట్టు సురక్షితం
యంగాన్ (మయన్మార్): ఏఎఫ్సీ కప్ కోసం మయన్మార్ వెళ్లిన 25 మంది సభ్యుల మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగానే ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడైంది. హోటల్లో డిన్నర్ చేసే సమయంలో భూకంపం సంభవించిందని, చిన్నగా మొదలైన ప్రకంపనల ధాటికి డిన్నర్ టేబుల్ అటూ ఇటూ ఊగడం ప్రారంభించిందని జట్టు వర్గాలు తెలిపాయి. వెంటనే జట్టు మొత్తం హోటల్ నుంచి బయటికి వచ్చేసి రోడ్‌పై నిలుచుంది. ప్రకంపనల ఆగిన తర్వాత ఆటగాళ్లు తమ గదుల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు కోల్‌కతాలో కూడా ఐపీఎల్ మ్యాచ్ టాస్ సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.