source: X
విండీస్‌తో రేపు జరుగబోయే రెండో టీ20కి ముందు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు మేనేజ్‌మెంట్‌కు స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. నెట్స్‌లో అతడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. జట్టు సమీకరణల వల్ల వైభవ్‌కు అవకాశాలు రాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైభవ్ తనలోని విధ్వంసకర కోణాన్ని మేనేజ్‌మెంట్‌కు మరోసారి గుర్తు చేశాడు.
నెట్స్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోయాడు. వైభవ్‌తో పోటీపడి మరీ షాట్లు ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్ విన్యాసాలు చూసి పోలీసులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, రెండో టీ20 రాంచీ వేదికగా జరుగనుంది. ఇది ఇషాన్ కిషన్‌కు సొంత మైదానం. రేపటి మ్యాచ్‌లో ఇషాన్ ప్రదర్శన కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు. ఇదే జరిగితే వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశ తప్పదు. మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌పై విశ్వాసాన్ని కొనసాగించినంత కాలం వైభవ్‌ది ఇదే పరిస్థితి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో తొలి టీ20 శతకంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్‌తో మరోసారి పోటీపడనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్


