పిడుగుపాటుకు ఫుట్‌బాల్‌ ఆటగాడి మృతి.. వైరల్‌ వీడియో | Lightning Strikes Football Player Mid-Match | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఫుట్‌బాల్‌ ఆటగాడి మృతి.. వైరల్‌ వీడియో

Nov 6 2024 3:01 PM | Updated on Nov 6 2024 3:41 PM

Lightning Strikes Football Player Mid-Match

ఫుట్‌బాల్‌ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా పిడుగు పడి ఓ ఫుట్‌బాలర్‌ ప్రాణాలు కోల్పోయాడు. రిఫరీ, మరో నలుగురు ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో గత ఆదివారం​ జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెరూలోని హ్యూయాన్‌కాయోలో నవంబర్ 3వ తేదీన దేశీయ ఫుట్‌బాల్ క్లబ్‌లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి వర్షం మొదలుకావండతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌ బాట పడుతుండగా.. 39 ఏళ్ల జోస్‌ హ్యూగో లా క్రూజ్‌ మెసాపై పిడుగు పడింది. 

పిడుగు నేరుగా హ్యూగోపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పిడుగు ప్రభావం సమీపంలో గల రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లపై పడటంతో వారు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఐదుగురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో ఇలాగే ఓ స్థానిక ఆటగాడిపై పిడుగు పడటంతో అతను  కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement