శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ జట్టుకు రెండో స్థానం  | Second place for Srinidhi Deccan FC team | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ జట్టుకు రెండో స్థానం 

Apr 14 2024 4:20 AM | Updated on Apr 14 2024 4:20 AM

Second place for Srinidhi Deccan FC team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐ–లీగ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు 3–2 గోల్స్‌ తేడాతో షిల్లాంగ్‌ లాజోంగ్‌ ఎఫ్‌సీ జట్టును ఓడించింది.

శ్రీనిధి జట్టు తరఫున విలియమ్‌ అల్వెస్‌ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్‌ రోసెన్‌బర్గ్‌ (16వ ని.లో), డేవిడ్‌ కాస్టనెడా మునోజ్‌ (84వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. షిల్లాంగ్‌ జట్టుకు ఫ్రాంగీ బువామ్‌ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్‌ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

14 మ్యాచ్‌ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్‌లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన మొహమ్మదాన్‌ స్పోర్లింగ్‌ క్లబ్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌కు అర్హత సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement