మళ్లీ ఓడిన భారత్‌.. వరుసగా రెండో పరాజయం | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత్‌.. వరుసగా రెండో పరాజయం

Published Fri, Jan 19 2024 7:13 AM

Asia Cup Mens Football: India Lost To Uzbekistan - Sakshi

ఆసియా కప్‌ పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.

ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్‌ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో సిరియాతో భారత్‌ ఆడుతుంది.    

Advertisement
Advertisement