ఎనిమిదేళ్ల తర్వాత... | The Ecuadorian team got their first win after eight years | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తర్వాత...

Jun 28 2024 4:04 AM | Updated on Jun 28 2024 4:04 AM

The Ecuadorian team got their first win after eight years

లాస్‌ వేగస్‌: కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఈక్వెడార్‌ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‌‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో ఈక్వెడార్‌ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్‌ కేసీ పాల్మెర్‌ సెల్ఫ్‌ గోల్‌తో ఈక్వెడార్‌ ఖాతా తెరిచింది. 

కెండ్రీ పెజ్‌ (45+4వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్‌ అందించాడు. అలాన్‌ మిండా (90+1వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement