
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) (పోర్చుగల్) చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో (FIFA World Cup 2026 Qualifiers) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు.
గతంలో ఈ రికార్డు గ్వాటెమాలా ఆటగాడు కార్లోస్ రుయిజ్ పేరిట ఉండేది. రూయిజ్ ఖాతాలో 39 గోల్స్ ఉండగా.. తాజా ప్రదర్శన అనంతరం రొనాల్డో గోల్స్ సంఖ్య 41కి చేరింది.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ చరిత్రలో టాప్-5 గోల్ స్కోరర్లు..
రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)- 41
కార్లోస్ రుయిజ్ (గ్వాటెమాలా)- 39
లియోనెల్ మెస్ (అర్జెంటీనా )- 36
అలీ దయీ (ఇరాన్)- 35
లెవండోవ్స్కీ (పోలాండ్)- 33
కాగా, లిస్బన్ వేదికగా పోర్చుగల్, హంగేరి మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్ రొనాల్డోనే చేశాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో ఓవరాల్ గోల్స్ సంఖ్య 947కు చేరింది. ప్రత్యేకించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతని గోల్స్ సంఖ్య 143కు పెరిగింది. 40 ఏళ్ల వయసులో రొనాల్డో రేసు గుర్రంలా పరిగెడుతూ 1000 గోల్స్ దిశగా దూసుకెళ్తున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో పోర్చుగల్ గ్రూప్-ఎఫ్ టాపర్‌గా కొనసాగుతోంది. నవంబర్ 14న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.
చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్