సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తో సీఎం రేవంత్‌రెడ్డి తలపడనున్నారు. అదేంటి... మెస్సీతో రేవంత్ తలపడటమేంటని అనుకుంటున్నారా...ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ఆడటమే కాదు.. ఇద్దరూ రెండు టీంలతో ప్రత్య ర్థులుగా తలపడనున్నారు. ఇందుకు ఈనెల 13న ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్ ఖరారైందని, ఆర్‌ఆర్–9, ఎల్ ఎం–10 టీంల మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరుగుతుంది.


