దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు | Brazilian Footballer Neymar Junior Rs 456 Crore Bugatti Penthouse In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు

Nov 21 2024 6:17 PM | Updated on Nov 21 2024 6:48 PM

Brazilian Footballer Neymar Junior Rs 456 Crore Bugatti Penthouse In Dubai

దుబాయ్‌లో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్    అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు.  దుబాయ్‌లోని బుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ  పెంట్‌హౌస్‌ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.

తాజా కొనుగోలుతో ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ పెంట్‌హౌస్‌ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది  ప్రపంచంలోని తొలి  బుగాట్టి  బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో భాగం.  ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్‌తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు.  

ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్‌ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్‌తోపాటు  లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్క్‌ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ  అండ్‌ బ్లాక్-థీమ్‌తో బెడ్‌రూమ్స్‌, గ్రిల్స్‌, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement