శ్రీనిధి డెక్కన్‌ జట్టును గెలిపించిన ఒలివేరా  | Srinidhi Deccan team won by Oliveira | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ జట్టును గెలిపించిన ఒలివేరా 

Mar 18 2024 1:18 AM | Updated on Mar 18 2024 1:18 AM

Srinidhi Deccan team won by Oliveira - Sakshi

కొడుమన్‌ (కేరళ): ఐ–లీగ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది.

ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్‌ గోల్‌తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్‌ అల్వెస్‌ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్‌ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement