ఫుట్‌బాల్‌ దిగ్గజం కాంప్‌బెల్ కన్నుమూత.. Former Arsenal legend Kevin Campbell dies at age of 54. Sakshi
Sakshi News home page

#Kevin Campbell: ఫుట్‌బాల్‌ దిగ్గజం కాంప్‌బెల్ కన్నుమూత..

Published Sat, Jun 15 2024 5:06 PM | Last Updated on Sat, Jun 15 2024 6:07 PM

Former Arsenal legend Kevin Campbell dies at age of 54

ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్సెనల్ ఎఫ్‌సీ లెజెండ్‌ కెవిన్ కాంప్‌బెల్(54) కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంప్‌బెల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. విన్ కాంప్‌బెల్ మరణ వార్తను అర్సెనల్ ఎఫ్‌సీ సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించింది.

"మా క్లబ్‌ మాజీ స్ట్రైకర్ కెవిన్ కాంప్‌బెల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతడి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. కెవిన్‌ని క్లబ్‌లో ప్రతీఒక్కరూ గౌరవించేవారు. ఆ కష్టసమయంలో కెవిన్‌ కుటంబసభ్యులకు ఆ దేవుడు అండగా నిలివాలని కోరుకుంటున్నాము. 

అదేవిధంగా కాంప్‌బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము" అని  అర్సెనల్ ఎఫ్‌సీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.  ఫుట్‌బాల్‌ వరల్డ్‌లో కాంప్‌బెల్ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన కాంప్‌బెల్.. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్‌బాల్‌ గేమ్‌లో కొనసాగారు. 

1988లో ఆర్సెనల్‌ తరపున ఫుట్‌బాల్‌ ఆసోషియేషన్‌ యూత్ కప్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రీమియర్ లీగ్‌లో అర్సెనల్ , నాటింగ్‌హామ్ ఫారెస్ట్ , ఎవర్టన్ , వెస్ట్ బ్రోమ్‌విచ్ అల్బియన్ జట్ల తరపున కూడా అర్సెనల్ ఆడాడు.  కాంప్‌బెల్ తన కెరీర్‌లో ఓవరాల్‌గా 148 గోల్స్ చేశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement