
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత స్టార్ మనూ భాకర్ వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను 219.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
మనూ భాకర్, సురుచి సింగ్, పలక్‌లతో కూడిన భారత జట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మను 583 పాయింట్లు, సురుచి 574 పాయింట్లు, పలక్ 573 పాయింట్లు సాధిచారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో రష్మిక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. ఫైనల్లో రషి్మక 241.9 పాయింట్లు స్కోరు చేసింది. రషి్మక, వన్షిక, మోహిని సింగ్‌లతో కూడిన భారత జట్టు 1720 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.