శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’  | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌ ‘డ్రా’ 

Published Fri, Dec 8 2023 4:08 AM

Srinidhi Deccan FC Match Draw - Sakshi

శ్రీనగర్‌: ఐ–లీగ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు రెండో ‘డ్రా’ నమోదు చేసింది. రియల్‌ కశ్మీర్‌ ఎఫ్‌సీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. రెండు జట్లకు గోల్‌ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్‌ లోపంతో సాధ్యపడలేదు.

13 జట్ల మధ్య జరుగుతున్న ఐ–లీగ్‌లో ఇప్పటి వరకు శ్రీనిధి జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ ఎఫ్‌సీతో హైదరాబాద్‌లో శ్రీనిధి జట్టు తలపడుతుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement