breaking news
FC
-
అమెజాన్‌లో అసలేం జరుగుతుందో చూస్తారా?
ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తయినా, విక్రేత దగ్గర్నుంచి మన ఇంటి వరకు చేరడం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లోని తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) సందర్శించే అవకాశాన్ని కల్పించనుంది.ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (క్యూ4) నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులోని తమ ఎఫ్‌సీల్లో ఉచిత టూర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిత్యం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా మొదలైన ప్రక్రియలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ గైడెడ్ టూర్లు వారానికి మూడు సార్లు చొప్పున, ఒక్కోటి 45–60 నిమిషాల పాటు ఉంటాయి. ఒక్కో టూర్లో 20 మంది పాల్గొనవచ్చు.టోక్యోలో జరిగిన ’డెలివరింగ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో అమెజాన్ ఈ విషయాలు తెలిపింది. ఈ టూర్లపై ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు త్వరలో వీలు కల్పించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా–ఆ్రస్టేలియా ఆపరేషన్స్) అభినవ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అమెజాన్‌కు బెంగళూరులో 20 లక్షల ఘనపుటడుగుల స్టోరేజ్ స్పేస్‌తో అతి పెద్ద ఎఫ్‌సీ ఉంది.ఇక ఉత్తరాదిలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. ఇది 4,50,000 చ.అ.ల్లో, సుమారు ఎనిమిది ఫుట్‌బాల్ మైదానాలంత పెద్దగా ఉంటుంది. 2014 నుంచి అంతర్జాతీయంగా అమెరికా, కెనడా, తదితర దేశాల్లోని 35 లొకేషన్లలో ఇరవై లక్షల మంది పైగా సందర్శకులు అమెజాన్ ఎఫ్‌సీలను సందర్శించారు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మ్యాచ్ ‘డ్రా’
శ్రీనగర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో ‘డ్రా’ నమోదు చేసింది. రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. రెండు జట్లకు గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో సాధ్యపడలేదు. 13 జట్ల మధ్య జరుగుతున్న ఐ–లీగ్‌లో ఇప్పటి వరకు శ్రీనిధి జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ ఎఫ్‌సీతో హైదరాబాద్‌లో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
సెమీస్‌లో గోవా ఎఫ్‌సీ
కొచ్చి: రినాల్డో డి క్రుజ్ (29, 50, 61వ నిమిషాల్లో) హ్యాట్రిక్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఎఫ్‌సీ గోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా 5-1తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఐఎస్ఎల్ బయటి మ్యాచ్‌ల్లో ఇదే అతి పెద్ద విజయం. రినాల్డో హ్యాట్రిక్‌తో పాటు జోఫ్రి (12వ ని.), దేశాయ్ (64వ ని.)లు గోవా తరఫున గోల్స్ చేశారు. పుల్గా (2వ ని.) కేరళకు ఏకైక గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో కేరళ పది మందితోనే ఆడటం జట్టుపై ప్రభావం చూపింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లతో 22 పాయింట్లు సాధించిన గోవా జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కేరళ 12 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. -
చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్‌పై ముంబై గెలుపు
ముంబై: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5-1తో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీని చిత్తు చేసింది. ముంబై తరఫున చెత్రి (25, 40, 48వ. ని.), నోర్డి (51వ ని.), బెర్టిన్ (87వ ని.) గోల్స్ చేయగా... బోతాంగ్ (29వ ని.) నార్త్ ఈస్ట్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ సీజన్లో ఇది రెండో హ్యాట్రిక్. చెన్నైయిన్‌కు చెందిన స్టీవెన్ మెండోజా... గోవాపై తొలి హ్యాట్రిక్ సాధించాడు. 10 పాయింట్లతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. ఢిల్లీ డైనమోస్‌తో తలపడుతుంది. -
కేరళపై పుణే విజయం
ఐఎస్ఎల్-2 పుణే: స్ట్రయికర్ కలూ ఉచే రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ పుణే సిటీ 3-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పుణే తరఫున మరో గోల్ సాన్లీ సాధించాడు. కేరళ నుంచి రెండు గోల్స్ రఫీ చేశాడు. ఆట ప్రారంభమైన నిమిషంలోనే రఫీ కేరళకు శుభారంభాన్ని అందించాడు. అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాని పుణే సిటీ తమ దాడులను కొనసాగించి 16వ నిమిషంలో ఉచే గోల్‌తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి. మొదట 23వ నిమిషంలో ఉచే తన రెండో గోల్‌తో పుణే ఆధిక్యాన్ని సాధించినా... రఫీ 30వ నిమిషంలో స్కోరును 2-2తో సమం చేశాడు. అయితే 72వ నిమిషంలో సాన్లీ హెడర్‌తో పుణే విజయాన్ని అందుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో నార్త్ఈస్ట్ తలపడుతుంది.