దటీజ్‌ జగన్‌.. | Vizag Steel Plant Accident, YS Jagan Meets Victims, Assures Support, Kutami Face Criticism From Workers | Sakshi
Sakshi News home page

దటీజ్‌ జగన్‌..

Jun 11 2026 8:50 AM | Updated on Jun 11 2026 9:08 AM

workers praise jagan after visiting steel plant accident victims

సాక్షి, విశాఖపట్నం :  స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్‌ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. 

ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో  భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్‌ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement