సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ బరితెగించింది.కూటమి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు మరో స్టేజ్‌కు చేరుకున్నాయి. అధికార అండతో కోర్టులో కేసు ఉండగానే యాజమాన్యం నిర్మాణాలను ప్రారంభించింది. అయితే, గీతం అక్రమ నిర్మాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

వివరాల ప్రకారం.. విశాఖలోని 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభించింది. అధికార అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక, ఇప్పటికే గీతం కబ్జా భూములను 22-ఏ జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల 5000 కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ జరిగింది.


