జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ.. | Janasena And TDP Leaders Clash In Visakhapatnam Over Photo In Flexy At Temple Event, More Details Inside | Sakshi
Sakshi News home page

జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..

May 9 2026 1:17 PM | Updated on May 9 2026 1:56 PM

Janasena And TDP Leaders Clash At Visaka Over Flexy Photo

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.

విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, విశాఖ సౌత్‌లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్‌ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్‌పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement