‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్‌ ఒప్పుకుంది’ | YSRCP Gudiwada Amarnath Serious On CBN Govt Over Sai Krishna Case | Sakshi
Sakshi News home page

‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్‌ ఒప్పుకుంది’

Jun 19 2026 11:41 AM | Updated on Jun 19 2026 12:32 PM

YSRCP Gudiwada Amarnath Serious On CBN Govt Over Sai Krishna Case

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్‌ రాజ్‌ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందించారు. అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.

సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement