Live Updates
స్టీల్‌ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాల్సిందే: వైఎస్ జగన్
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణం: వైఎస్ జగన్
- సెవెన్‌హిల్స్ ఆసుపత్రి వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..
- స్టీల్‌ప్లాంట్ ప్రమాదం బాధాకరం
- ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు.
- ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
- 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు.
- ఉక్కు కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాలి.
- వైఎస్సార్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది.
- కూటమి హయాంలో ఎలా ఉందో అందరూ గమనించాలి.
- విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది.
- 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశాం.
- ప్రైవేటీకరణ జరగకూడదని గట్టిగా చెప్పాం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో ప్రవర్తించాలి.
- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మోదీకి రెండు లేఖలు రాశాం.
- ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాం.
- ప్రైవేటీకరణను ఆపి కార్మికులకు అండగా నిలిచాం.
- కార్మికుల కోసం గట్టిగా పోరాడాం.
- మా ప్రభుత్వం దిగేసరికి 28వేల మంది పనిచేస్తున్నారు.
- కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో 10500 మందిని తొలగించారు.
- 6500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.
- వీఆర్ పేరుతో 1800 మందిపై ఒత్తిడి చేసి తప్పించారు.
- మరో 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించారు.
- ఉద్యోగుల సంఖ్యను 16వేలకు కుదించారు.
- స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.
- నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు.
- ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌తో లింక్ పెట్టారు.
- వైఎస్సార్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో విద్యుత్ యూనిట్‌కు 50 పైసలే.
- కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50లకు పెంచారు.
- క్వార్టర్స్‌ను వదిలి ఉద్యోగులు వెళ్లిపోయేలా చేస్తున్నారు.
- ఉద్యోగులను బోనస్, మెడికల్ ఫెసిలిటీ ఏమీ లేవు.
- రూ.11440 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని మంత్రులు చెబుతున్నారు.
- ఇచ్చిన ప్యాకేజీ మెయింటెనెన్స్ కోసం కాదు.
- వీఆర్‌ఎస్‌పై పంపేందుకు, బ్యాంక్ లోన్ల కోసమే ప్యాకేజీ ఇచ్చారు.
- ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు.
- స్టీల్‌ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు.
- లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవడంతోనే ప్రమాదం జరిగింది.
- ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి.
- కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం.
- 14 నెలల క్రితం ఇలాంటి తరహా ప్రమాదం జరిగింది.
- ప్రమాదంలో పెంటయ్య అనే కార్మికుడు చనిపోయారు.
- అప్పుడు నెలలోనే ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పారు.
- ఇప్పటి వరకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు.
- అధికారులను అడిగితే ఫైల్ పోయిందంటున్నారు.
- కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.
- నిన్న లోకేష్ మాటలు చూస్తే ఆశ్చర్యమేసింది.
- లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది.
- బాధితులకు ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారో చెప్పలేదు.
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
- బాధితులకు రూ.1.72 కోట్లు మీరు ఇచ్చేదేంటి?.
- వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలాంటి ఘటనే జరిగినప్పుడు మేము వెంటనే స్పందించాం.
- ఘటనా స్థలానికి వచ్చి రూ.కోటి పరిహారం ప్రకటించాం.
- బాధిత కుటుంబాలకు అప్పట్లో వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంది.
- కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అన్యాయంగా ఉంది.
- బాధితులకు రావాల్సినవి రాకుండా చేస్తున్నారు.
- బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి.
- స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి.
- చంద్రబాబు ప్రభుత్వం కానీ పరిహారం ఇవ్వకపోతే..
- మేము అధికారంలోకి రాగానే రూ. కోటి పరిహారం ఇస్తాం.
2026-06-10 13:33:46
కార్మిక సంఘాలతో వైఎస్ జగన్ సమావేశం..
- కార్మిక సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం..
- కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన వైఎస్ జగన్
- స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న జగన్
- స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులను వివరిస్తున్న కార్మికులు
- ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్
2026-06-10 12:57:33
సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో వైఎస్ జగన్..
- విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
- సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి చేరుకున్న వైఎస్ జగన్
- ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ.
- స్టీల్‌ప్లాంట్ బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్.
- వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.
- బాధిత కుటుంబాలతో మాట్లాడిన జగనన్న.
- వారికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.
2026-06-10 12:17:44
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు..
- వైఎస్ జగన్ పర్యటనపై కూటమి కుట్రలు..
- ఎయిర్‌పోర్టులో పోలీసుల అత్యుత్సాహం.
- మాజీ సీఎం జగన్‌ను గేటు నెంబర్-2 నుంచి కాకుండా కామన్ అరైవల్స్ నుంచి పంపించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది.
- గేటు నెంబర్-2 నుంచి పంపించకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం.
- ప్రభుత్వం పెద్దల కుట్రల వల్లే ఎయిర్‌పోర్టులో గందరగోళం.
- ఆంక్షల పేరుతో పోలీసుల ఓవరాక్షన్.
2026-06-10 11:57:43
విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసుల ఓవరాక్షన్
- కేకేరాజు కామెంట్స్..
- కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది.
- జగన్ పర్యటనను ఆలస్యం చేసేందుకు కుట్రలు.
- కూటమి నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు.
- బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చారు.
2026-06-10 11:46:04
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్..
- విశాఖ చేరుకున్న వైఎస్ జగన్.
- కాసేపట్లో స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ.
2026-06-10 11:22:41
కేజీహెచ్‌లో హైడ్రామా..
- కూటమి ప్రభుత్వ శవ రాజకీయం..
- వైఎస్ జగన్ కేజీహెచ్‌కు వస్తున్నారని తెలిసి మృతి చెందిన పైడిరాజు మృతదేహం తరలింపు..
- గంటలో మృతదేహాన్ని తరలించిన అధికారులు.
- ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు ఇవ్వడానికి నిన్న 12 గంటల సమయం.
- నేడు గంటలో మృతదేహం తరలింపు..
2026-06-10 11:17:13
విశాఖ పోలీసుల ఓవరాక్షన్..
- విశాఖ పోలీసుల ఓవరాక్షన్..
- విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్..
- వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డగిస్తున్న పోలీసులు.
- ఎయిర్‌పోర్టుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు బాలరాజు, దేవన్ రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు
2026-06-10 10:59:37
కాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్..
- కాసేపట్లో ఉక్కు పరిశ్రమ బాధితులను పరామర్శించనున్న వైఎస్ జగన్
- ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వనున్న వైఎస్ జగన్.
- మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.
- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం.
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు అందని సాయం.
2026-06-10 10:52:22
తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..
- తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..
- స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..
- సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు అనే కార్మికుడు మృతి..
- ప్రమాదం జరిగిన తరువాత అందరినీ కంటతడి పెట్టించిన పైడిరాజు వీడియో..
- ప్రాణాలతో పోరాడుతూ కుటుంబ సభ్యుల కోసం వీడియో విడుదల చేసిన పైడిరాజు..
2026-06-10 10:18:55
విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్
- విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్
- కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
- సెవెన్ హిల్స్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న జగన్
2026-06-10 10:18:55
స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు..
- స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు..
- స్టీల్‌ప్లాంట్‌లో గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాలు.
- ఎస్ఎంఎస్-2లో మొదట సంభవించిన ప్రమాదం.
- ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కార్మికులు.
- ఎస్ఎంఎస్-2లో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఎస్ఎంఎస్-1లో భారీ ప్రమాదం.
- ప్రమాదంలో ఎనిమిది మంది మృతి, ఆరుగురికి గాయాలు.
- రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు.

2026-06-10 09:36:30
కార్మికులతో కూటమి సర్కార్ చెలగాటం..
- కార్మికులతో కూటమి సర్కార్ చెలగాటం..
- ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు
- కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం
- సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లే భారీ ప్రమాదం
- ఇప్పటికైనా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల తొలగింపు, వీఆర్‌ఎస్ ఆపాలి
- ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే మృతుల కుటుంబాలకు కోటి పరిహారమివ్వాలి
- శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
2026-06-10 09:26:19
కాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్
- కాసేపట్లో విశాఖ బయలుదేరనున్న వైఎస్ జగన్
- స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి వైఎస్ జగన్ పరామర్శ
- ప్రమాద సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశం
- ఉదయం 10.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్
- మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో పరామర్శ.
- అక్కడినుంచి మధ్యాహ్నం 2 గంటలకు కిమ్స్ ఆసుపత్రికి రాక.
- ఆసుపత్రిలో క్షతగాత్రులను, బాధితులను పరామర్శించి తిరుగు పయనం.
2026-06-10 09:24:50
Advertisement


