‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’ | YSRCP Leader KK Raju Slams Chandrababu Comments | Sakshi
Sakshi News home page

‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’

Mar 28 2026 6:11 PM | Updated on Mar 28 2026 7:25 PM

YSRCP Leader KK Raju Slams Chandrababu Comments

విశాఖ:  అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా  వైఎస్‌ జగన్‌ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్‌ జగన్‌ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే  వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. 

అమరావతిని  వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు.

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement