అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేశాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments Over Visakha And MAVIGUN | Sakshi
Sakshi News home page

అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేశాం: వైఎస్‌ జగన్‌

Apr 1 2026 12:45 PM | Updated on Apr 1 2026 1:34 PM

YS Jagan Key Comments Over Visakha And MAVIGUN

సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్‌. దోపిడీ నుంచి డైవర్షన్‌ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం​.

అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌.. 
రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.

ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.

కిలోమీటర్ కు  170 కోట్లా..కొంచమైనా సిగ్గుందా బాబు

MAVIGUN ప్లాన్‌ ఇదే.. 
పోనీ మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్‌-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద డిక్లేర్‌ చేస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:

మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్‌ కారిడర్‌ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని,  దాంట్లో బేసిక్‌ ఇన్‌ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్‌ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ఏపీ కొత్త రాజధాని MAVIGUN!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement