స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్‌ నిర్లక్ష్యం | Visakha Steel Plant Fire Accident June 9th 2026 Updates | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్‌ నిర్లక్ష్యం

Jun 9 2026 7:50 AM | Updated on Jun 9 2026 7:41 PM

Visakha Steel Plant Fire Accident June 9th 2026 Updates

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్‌ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్‌డేట్స్‌.. 

మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు
  • మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
  • 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు
  • ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైంది
  • గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారు
  • అనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణం
  • యాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు

కార్మిక సంఘాల డిమాండ్‌ ఇదే

  • స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
  • కాలం చెల్లిన యంత్రాలను తొలగించి  కొత్త వాటిని నిర్మించాలి
  • కార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
  • మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
  • క్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలి

పవన్‌ కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు

  • స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నేతలపై పవన్‌ కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు
  • స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు

మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి

  • స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి
  • భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు
  • నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు
  • మృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులు
  • బిహార్‌కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూపు

బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన వైఎస్సార్‌సీపీ నేతలు

  • విశాఖ కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్‌న్నాథ్‌, కేకే
  • ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం: బొత్స
  • కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోంది
  • స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్‌ కుట్రలు
  • స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పే
  • కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?
  • విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్‌ప్లాంట్‌ వచ్చింది
     

అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యం

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యం
  • ఘోర ప్రమాదం జరిగిన స్పందించని సీఎం చంద్రబాబు, మంత్రులు
  • నిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతి
  • విజయవాడలోనే ఉన్నా విశాఖపట్నం వెళ్లని సీఎం చంద్రబాబు
  • ఈరోజు ఉదయం వరకు ఒక్కరు కూడా వెళ్లని రాష్ట్ర మంత్రులు
  • కేంద్రమంత్రి కుమారస్వామి వచ్చాక వచ్చిన రాష్ట్ర మంత్రులు
  • ఈరోజు ఉదయం వెళ్లిన మంత్రి నారా లోకేష్
  • లోకేష్ తర్వాత వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
  • కేంద్రమంత్రి వచ్చేవరకు సంఘటన వైపు కన్నెత్తి చూడని హోంమంత్రి అనిత
  • కనీసం పట్టించుకోని జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులు
  • ఈరోజు కూడా విశాఖకు వెళ్లని సీఎం చంద్రబాబు
  • విజయవాడలోనే సమీక్షలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబు

రేపు విశాఖకు వైఎస్ జగన్‌

  • స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్
  • ఆసుపత్రులలో ఉన్న క్షతగాత్రులకు పరామర్శ

ఏపీలో రెడ్‌బుక్‌ అరాచకం నడుస్తోంది: గుడివాడ అమర్‌నాథ్‌

  • కార్మిక సంఘాలను లోకేష్‌ అవమానించాడు
  • లోకేష్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు
  • ఎవరికీ సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్‌ మాట్లాడారు
  • కార్మికులను బెదిరించే ధోరణిలో లోకేష్‌ మాట్లాడారు
  • బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
  • కార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసింది

స్టీల్‌ ప్లాంట్‌ వద్ద లోకేశ్‌కు చేదు అనుభవం

  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్దకు మంత్రి నారా లోకేశ్‌

  • హోం మంత్రి అనితతో ప్లాంట్‌ వద్దకు వెళ్లిన లోకేశ్‌

  • లోకేశ్‌ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలు

  • లోకేశ్‌ను నిలదీసిన కార్మిక సంఘాలు

  • నైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహం

  • ఎంపీ భరత్‌, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలు

  • కార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్‌

  • వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్‌

  • ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహం

  • ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్‌ అసహనం

  • లోకేశ్‌ తీరుపై మండిపడ్డ కార్మికులు

👉విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీ­సుకుంది. లాడెల్‌ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్‌ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్‌ అగ్నిగుం­డంగా మారింది.

👉గత రెండు నెలలుగా లాడెల్స్‌ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్‌ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్‌ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్‌ ప్లాంట్లలో ఇలా లాడె­ల్‌లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్‌ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్‌ రియాక్షన్‌ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement