ఏపీ గవర్నర్‌కు బొత్స లేఖ.. | YSRCP botsa satyanarayana Wrote Letter To Governor Abdul nazeer | Sakshi
Sakshi News home page

ఏపీ గవర్నర్‌కు బొత్స లేఖ..

Jul 10 2026 1:28 PM | Updated on Jul 10 2026 1:34 PM

YSRCP botsa satyanarayana Wrote Letter To Governor Abdul nazeer

సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ గురజాడ-విజయనగరం తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బొత్స సత్యనారాయణ తన లేఖలో కోరారు.

జేఎన్‌టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు బొత్స లేఖ రాశారు. ఈ లేఖలో బొత్స.. స్నాతకోత్సవానికి ఆహ్వానం అందించినందుకు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయనగరం జిల్లా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయని లేఖలో తెలిపారు.

ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రజల గౌరవం, ఆనందం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగర ప్రజల అభిప్రాయాలను గౌరవించి, జేఎన్‌టీయూ గురజాడ తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని గవర్నర్‌ను కోరారు. విజయనగరం ప్రజల అసంతృప్తి, నిరసనలను ఈ లేఖ ద్వారా గవర్నర్‌ దృష్టికి తీసుకువస్తున్నట్టు బొత్స తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement