విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి | KFC UNVEILS INDIA TALLEST SAND BUCKET In RK BEACH | Sakshi
Sakshi News home page

విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి

Mar 24 2026 12:32 PM | Updated on Mar 24 2026 12:37 PM

KFC UNVEILS INDIA TALLEST SAND BUCKET In RK BEACH

విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరం మరో అరుదైన ఘటనకు నిలయమైంది. విశాఖలో సరికొత్త సైకత(ఇసుక శిల్పం) శిల్పం పర్యాటకులకు మరింతగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సరికొత్త సైకత శిల్పం ఏంటని అనుకుంటున్నారా?. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ 'కేఎఫ్‌సీ' (KFC)కి చెందిన చికెన్ బకెట్‌. దీనికి సంబంధించిన భారీ ఆకార శిల్పం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది భారత్‌లోనే అతిపెద్ద ఇసుక నిర్మాణం కావడం గమనార్హం.

విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ మిషన్ బీచ్‌లో ఇటీవల ఒక అద్భుతమైన ఇసుక శిల్పం వెలిసింది. విశాఖలో కేఎఫ్‌సీ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, కేఎఫ్‌సీ సైకత శిల్పం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా, ఈ అద్భుత కళాఖండాన్ని ప్రముఖ స్థానిక సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. కేవలం ఇసుకను మాత్రమే ఉపయోగించి తయారు చేసిన ఈ శిల్పం చూడటానికి అచ్చు అసలైన కేఎఫ్‌సీ చికెన్ బకెట్‌లాగే ఉండటం గమనార్హం.

ఇక, ఈ శిల్పంపై కేఎఫ్‌సీ వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ ముఖచిత్రాన్ని ఎంతో స్పష్టంగా చెక్కారు. దీనిని రూపొందించడానికి ఆయన సుమారు రెండు రోజుల పాటు నిరంతరంగా శ్రమించారు. ఈ భారీ శిల్పాన్ని "ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్" గా అభివర్ణిస్తున్నారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఈ శిల్పం ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ భారీ ఇసుక శిల్పం ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, ఇది విశాఖపట్నం నగరంలో కేఎఫ్‌సీ 14వ బ్రాంచ్ కావడం విశేషం. సముద్ర తీర వాతావరణానికి అనుగుణంగా, కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్‌ను రూపొందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement