breaking news
sand art
-
చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..
గండ శిలతో చెక్కిన శిల్పాలను చూస్తాం.పూరీ చెక్కుకున్న దారు శిల్పాలను చూస్తాం.చంద్రభాగలో సైకత శిల్పాలను కూడా చూస్తాం. అశోకుడి తొలి బౌద్ధచిహ్నం ధవళగిరి స్థూపం...దేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు చిలకాలేక్.శిల్పరాజాలు కందగిరి... ఉదయగిరి గుహలు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజ్ టూర్లో చూస్తాం. అది కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూర్. ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది?డిసెంబర్ 1 నుంచి 5 వరకు...టూర్‌కి టికెట్ బుక్ చేసుకుందాం.ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025. ఇది 15వ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఈవేడుకలకు వేదిక ఒడిశా రాష్ట్రం, కోణార్క్‌లోని చంద్రభాగ బీచ్. 1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు చేరాలి. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ ఆపరేటర్లు రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణం. దారిలో ధౌలి స్థూప వీక్షణం. పూరికి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అవడం, రాత్రి బస.ధవళ గిరి స్థూపంకొండ మీద తెల్లటి స్థూపం. భువనేశ్వర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన పూరీకి వెళ్లే దారిలో ఉంటుంది. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత నిర్మించిన తొలి స్థూపం ఇది. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో మనసు కకావికలమైన అశోకుడు బౌద్ధం వైపు మరిలిన సంగతి తెలిసిందే. అశోకుడు శాంతి మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్థూపం కావడంతో దీనికి శాంతి స్థూపం అని పేరు. బౌద్ధ సన్యాసులు ఈ స్థూపాన్ని సభక్తిగా దర్శించుకుంటారు.2వ రోజుతెల్లవారు జామున బయలుదేరి జగన్నాథుని దర్శనానికి వెళ్లాలి. ఇది ప్యాకేజ్‌లో వర్తించదు. పర్యాటకులు తమకు తాముగా వెళ్లి రావాలి. దర్శనం తర్వాత హోటల్‌కు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టూర్ సత్పద వైపు సాగిపోతుంది. చిలకా సరస్సు వీక్షణం తర్వాత తిరిగి పూరీకి చేరాలి. రాత్రి బస పూరీలోనే.జగన్నాథపురిపూరీ అని పిలిచే పట్టణానికి ఆ పేరు రావడానికి జగన్నాథుని ఆలయమే ప్రధానం. జగన్నాథపురి అనే పేరు నుంచి పురి అనే పేరు వ్యవహారంలో పూరీగా మారిపోయింది. ఈ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు పూజలందుకునే దైవాలు. బలరాముడు, శ్రీకృష్ణుడు, వారి చెల్లెలు సుభద్ర విగ్రహాలు దారుశిల్పాలు. విగ్రహాల రూపం అసంపూర్తి రూపాలతో విచిత్రంగా ఉంటుంది. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే వంటకాలు తయారు చేసే గది ‘రోసాఘర’ను కూడా చూడాలి. 56 రకాల పదార్థాలను వండుతారు. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.సముద్రమంత సరస్సుచిలకా సరస్సు 11 వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనదేశంలో తీర్ర΄ాంతంలో విస్తరించిన పెద్ద తీర సరస్సు ఇది. దయా నది, భార్గవి నది, మకర, మాలగుని, లునా నదుల నీరు బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోట ఆటు΄ోట్లకు సముద్రపు నీరు వెనక్కు తోసుకు రావడంతో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఇది. మన తెలుగు రాష్ట్రంలో పులికాట్ సరస్సు కూడా అలాంటిదే. పులికాట్ సరస్సుకు వచ్చినట్లే ఖండాంతరాల నుంచి పక్షులు ఇక్కడికి కూడా ఏటా వలస వస్తాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తమతో తీసుకెళ్లిపోతాయి. చిలకా సరస్సు మరో ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి విదేశీ వర్తక వాణిజ్యాలు జరిగిన ప్రదేశం ఇది. యునెస్కో సంస్థ చిలకా సరస్సును వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. సత్పద అనే ప్రదేశంలో సరస్సు మీద కొంత దూరం వెళ్ల్లడానికి ఒక ఫ్లాట్‌ఫామ్ ఉంటుంది. నీటి మీద విహారాన్ని ఆస్వాదించవచ్చు. 3వ రోజుబ్రేక్ఫాస్ట్, హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత కోణార్క్‌కు ప్రయాణం. కోణార్క్ సూర్యదేవాలయ వీక్షణం, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ఆస్వాదించడం. సాయంత్రం భువనేశ్వర్‌కు ప్రయాణం. హోటల్ చెక్ ఇన్. రాత్రి బస భువనేశ్వర్‌లో.రథచక్రాలయంకోణార్క్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. సూర్యదేవాలయాన్ని చూడడం అంటే ఖగోళశాస్త్రాన్ని శిల్పాల రూపంలో తెలుసుకోవడం. ఆలయం ప్రాంగణంలోని సన్టెంపుల్ మ్యూజియాన్ని చూడడం మర్చి΄ోవద్దు. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ఏటా అలరించేది. ఇప్పుడు సైకత శిల్ప కళల వేడుక కూడా తోడవడంతో కోణార్క్ పర్యాటకధామంగా మారింది.ఇసుక బొమ్మల కొలువుకోణార్క్లోని చంద్రభాగ బీచ్‌లో సాండ్ ఆర్ట్ కొలువు దీరి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశ విదేశాల సాండ్ ఆర్టిస్టులు పాల్గొంటారు. ప్రపంచ శాంతి, ప్రకృతి పరిరక్షణ వంటి థీమ్‌లతో ఒక్కొక్క ఆర్ట్ ఒక్కో సందేశాన్నిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ సరదాగా మొదలు పెట్టిన సైకత శిల్పకళకు చక్కటి ఆదరణ లభించింది. ఎంతగా అంటే... ముఖ్యమైన సందర్భాలు, సామాజిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ అంశాన్ని పట్నాయక్ ఎలా రూపొందించాడో చూడడానికి టెలివిజన్ వార్తలను ఫాలో అయ్యేంతగా. ఇప్పుడు సుదర్శన పట్నాయక్ సాండ్ ఆర్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అతడి బాటలో ఈ తరం యువతీయువకులు సాండ్ ఆర్ట్‌లో శిక్షణ పొంది, ఒకరిని మించి మరొకరు చక్కటి సైకత శిల్పాలకు రూపమిస్తున్నారు.4వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత జాజ్‌పూర్‌కు ప్రయాణం. బిరజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకున్న తర్వాత రత్నగిరి బౌద్ధక్షేత్ర వీక్షణం. తిరిగి భువనేశ్వర్‌కు చేరాలి. రాత్రి బస భువనేశ్వర్‌లోనే.బిరజాదేవి ఆలయంఒడిశాలో బిరజ అనే పదానికి అసలు ఉచ్చారణ విరజ. గిరిజాదేవినే ఒడియా వాళ్లు బిరజాదేవి అంటారు. ఇది దుర్గాదేవి శక్తిపీఠం. విరజ క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూసే ఆలయం 13వ శతాబ్దం నాటిది. రత్నగిరి బౌద్ధక్షేత్రం ఒక పురాతత్వగని. తవ్వేకొద్దీ విషయాలను వెల్లడిస్తోంది. రత్నగిరి బౌద్ధ క్షేత్రమే కాని ఇక్కడ హిందూ పౌరాణిక పాత్రల శిల్పాలు అనేకం ఉంటాయి. ఈ బౌద్ధక్షేత్రంలోని నిర్మాణాలు ఐదవ శతాబ్దం నుంచి మొదలై పదవ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో నిర్ధారణ అయింది. 16వ శతాబ్దంలో వరదల్లో కప్పబడి పోవడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణాలున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయారు. తవ్వకాల్లో దొరికిన శిల్పాలతో ఈ ప్రాంగణంలో మ్యూజియం ఉంది. రత్నగిరి, లలిత్‌గిరి, ఉదయగిరి గుహలను కలిపి డైమండ్ ట్రయాంగిల్‌గా పిలుస్తారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్, గది చెక్ అవుట్ చేసిన తర్వాత లింగరాజ ఆలయానికి ప్రయాణం. ఆ తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, రాజారాణి టెంపుల్ వీక్షణం. మధ్యాహ్నం తర్వాత కందగిరి గుహలు, ఉదయగిరి గుహల్లో విహారం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు టూర్ నిర్వహకులు పర్యాటకులను భువనేశ్వర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.ఆలయాల భువనంభువనేశ్వర్లో ఏమి చూడాలని అడిగితే లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్, రాజారాణి ఆలయాలు అని ఒక్కమాటలో చెప్పవచ్చు. భువనేశ్వర్ గొప్పశిల్ప నిలయం. లింగరాజ ఆలయాన్ని దర్శించిన వాళ్లు, ఆలయం గురించి వివరించేటప్పుడు మొదటి మాటగా నిర్వహణ లోపాన్ని ప్రస్తావిస్తారు. చాలా మురికిగా ఉంటుందని ఆవేదన చెందుతారు. భారీ నిర్మాణం. ఆలయ నిర్మాణకౌశలం ప్రత్యేకంగా ఉంటుంది. మన దక్షిణాది నిర్మాణాలు, ఉత్తరాది నిర్మాణాలకు భిన్నమైన కళింగ నిర్మాణశైలి ఇది. ముక్తేశ్వర్ ఆలయంలో ఏకరాతి శిలాతోరణ ద్వారం గొప్ప శిల్పచాతుర్యమనే చె΄్పాలి. భువనేశ్వర్‌లోని రాజారాణి ఆలయం కూడా పుణ్యక్షేత్రమే. ఈ ఆలయ నిర్మాణం అంతా పసుపు, ఎరుపు సాండ్‌స్టోన్‌ల కలయిక. ఈ రెండు రంగుల రాళ్లను రాజారాణి రాళ్లుగా పిలుస్తారు. అందుకే ఇది శివాలయమే అయినా రాజారాణి ఆలయంగా వ్యవహారంలోకి వచ్చింది.కందగిరి ఉదయగిరి గుహలుకొండలను గుహలుగా తొలచడమే ఒక అద్భుతం అనుకుంటే గుహల్లోపల గోడల నిండుగా రకరకాల థీమ్‌లతో శిల్పాలుంటాయి. స్థూలంగా చూసినప్పుడు శిల్పాలన్నీ ఒకేరీతిలో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే పౌరాణిక కథల సన్నివేశాలు కళ్లకు కడుతాయి. చేతికందే ఎత్తులో ఉన్న శిల్పాలు యుద్ధానంతర దాడుల్లో ధ్వంసమైన వైనం కూడా అవగతమవుతుంది. ఉదయగిరి గుహల్లో గణేశ గుహను గమనించడం మర్చిపోవద్దు. పదడుగుల ఎత్తున్న కొండను తొలిచి వరండాలాగ మలిచారు. ఎదురుగా చెరుకు తింటున్న ఏనుగులు, ద్వార΄ాలకుల్లాగ సైనికులు, వరండా పైకప్పుకి స్తంభాల్లాగ చెక్కిన రాతిని కలుపుతూ నమస్కార ముద్రలో ఉన్న సాలభంజికలు... చూడ చక్కగా ఉంటాయి.టూర్ వివరాలివిఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ పేరు ‘కోణార్క్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్’. ప్యాకేజ్ కోడ్ : ఎస్హెచ్ఏ42. ఇది ఐదు రోజుల టూర్. హైదరాబాద్ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో చిలకా లేక్, కోణార్క్ టెంపుల్, బిరజాదేవి ఆలయం, భువనేశ్వర్ ప్రదేశాలకు కవర్ అవుతాయి.నవంబర్ 30వ తేదీ 12.35 గంటలకు ‘6ఈ 6911’ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 14.10 గంటలకు భువనేశ్వర్‌కు చేరుతుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ‘6ఈ 631’ ఫ్లైట్ 22.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి రాత్రి 23.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.టికెట్ ధరలిలాగ:సింగిల్ ఆక్యుపెన్సీలో 43,950 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,800 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 32,650 రూపాయలు. బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407– వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
సైకత శిల్పంలో వందేళ్ల ఆర్ఎస్ఎస్.. వ్యవస్థాపకులకు పట్నాయక్ నివాళులు
భువనేశ్వర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేడు (విజయ దశమి) వందవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమయ్యింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తుచేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయంగా పలువురు ప్రశంసలు పొందిన సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో ‘100 ఏళ్ల నిస్వార్థ సేవ’ అనే సందేశంతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.ఎనిమిది టన్నుల ఇసుకతో రూపొందించిన ఈ ఆరు అడుగుల పొడవైన కళాకృతిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ)లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘వందేళ్ల ఆర్ఎస్ఎస్ అందించిన క్రమశిక్షణ, నిస్వార్థ సేవా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. 65కి పైగా అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పట్నాయక్.. వాతావరణ మార్పు, ప్రజారోగ్యం తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచేందుకు సైకత కళను ప్రదర్శిస్తుంటారు. #RSS100Years | Padma Shri Sudarsan Pattnaik, the acclaimed sand artist, created a magnificent sand art at Puri Beach, offering a cultural salute to the Rashtriya Swayamsevak Sangh (RSS) as it celebrates its Centenary Year.The artwork features RSS founder Dr. K.B. Hedgewar on… pic.twitter.com/NQzum7KRRP— Organiser Weekly (@eOrganiser) October 1, 20251925లో నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. -
ఏనుగులను పరిరక్షిద్దాం : సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్
World Elephant Day 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ పూరీ సాగర తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్దాడు. ఈ సందర్భంగా గజరాజుల సంరక్షణ కోసం ఏనుగుల ఆవాస అటవీ ప్రాంతాలను పరిరక్షించడం బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. – భువనేశ్వర్/పూరీ ప్రతీ ఆగస్టు 12న, ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్షణం ఏనుగులు గురించి ఆలోచించే రోజు.. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. అత్యంత అసాధారణ జంతువులలో ఒకదైన గజరాజును రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే ప్రపంచవ్యాప్త పిలుపు.ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?ఈ రోజు 2012లో ప్రారంభమైంది. కెనడియన్ చిత్రనిర్మాత ప్యాట్రిసియా సిమ్స్, థాయిలాండ్‌కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్‌తో కలిసి, విలియం షాట్నర్ కథనం ప్రకారం రిటర్న్ టు ది ఫారెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైన తర్వాత దీనిని మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) -
World Crocodile Day 2025 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్, అలరించిన సాండ్ క్రొకోడైల్స్
World Crocodile Day ను ప్రతీ ఏడాది జూన్ 17న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 2017లో జరుపుకున్నారు. మొసలి పరిశోధన కూటమి దీన్ని మొదలు పెట్టింది., ది బెలిజ్ జూ & ట్రాపికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాయి. ప్రాముఖ్యత:అనేక నదులు , చిత్తడి ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలో మాంసాహారాలుమొసళ్లు. నీరు , భూమి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మాంసాహారులుమొసళ్ళు సహాయపడతాయి.మొసళ్ళు అంతరించిపోతే, ఆహార గొలుసు తీవ్రంగా ప్రభావితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొసళ్ళ గురించి ఆసక్తికరమైన విషయాలు: ప్రపంచంలో దాదాపు 23 జాతుల మొసళ్ళు ఉన్నాయి.ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు - ఇది 7 మీటర్ల పొడవు ,1000 కిలోల వరకు బరువు ఉంటుంది.గుడ్లు పెట్టడం ద్వారా జాతిని వృద్ధి చేస్తాయి.భారతదేశంలో మొసళ్ల స్థితి:భారతదేశంలో మూడు ప్రధాన జాతులు కనిపిస్తాయి:మగ్గర్ లేదా మార్ష్ మొసలిఉప్పునీటి మొసలిఘరియల్ఘరియల్ను IUCN తీవ్రంగా ప్రమాదంలో ఉన్నట్లు ప్రకటించింది.భారతదేశంలో 1975లో "మొసలి సంరక్షణ ప్రాజెక్ట్" ప్రారంబించారు.దీని ఫలితంగా ఒడిశాలోని భితార్కనికా వంటి ప్రాంతాలలో వాటి సంఖ్య భారీగా పెరిగింది.పరిరక్షణ సవాళ్లు: నదీ తీరాలు అక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో వీటి ఉనికి ప్రమాదంలో పడింది. మొసళ్లు అంతరించిపోవడంలో వేట(చర్మం, మాంసం, మందుల కోసం) అనేది మరో ప్రధాన కారణం. చేపల వేటలో చిక్కుకోవడం వల్ల మరి కొన్నిమరణాలు సంభవిస్తున్నాయి. ఆకర్షించిన సైకత మొసళ్లు రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా’ కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరోవైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. -
ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్‌తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శాండ్ ఆర్ట్ మాధ్యమంలో చంద్రయాన్-3ని తీర్చిదిద్ది దేశప్రజలకు వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శాండ్ ఆర్ట్‌లో నిపుణుడైన విద్యార్థి అజయ్ త్రివర్ణాలతో కూడిన చంద్రయాన్-3ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ మన దేశం ఏనాడో స్వాతంత్ర్యం సాధించిందని, అయితే ఇప్పుడు చంద్రయాన్-3 పూర్తి స్థాయిలో సఫలమైతే మనదేశంలో ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన స్వతంత్ర్య దేశంగా రూపొందుతుందన్నారు. ఇస్రో ఇటీవలే చంద్రయాన్-3ని చంద్రుని నాల్గవ కక్ష్యలోకి పంపింది. ప్రస్తుతం చంద్రయాన్ దాదాపు 150 కి.మీ x 177 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ఇస్రో ఆగస్టు 14న ఉదయం 12 గంటల ప్రాంతంలో చంద్రయాన్-3లోని థ్రస్టర్లను ఆన్ చేసింది. దాదాపు 18 నిమిషాల పాటు ఇంజన్ ఆన్ చేశారు. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని మొదటి కక్ష్యలోకి చేరుకుంది. ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. -
Video: ఆస్కార్ ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు వెరైటీ విషెస్
నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అంతర్జాతీయ శాండ్ యానిమేటర్ మాస కుమార్ సాహు సైకత యూనిమేటర్తో కళాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 7 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి, 1 నిమిషం 50 సెకన్ల నిడివితో యానిమేటెడ్ వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. ఉత్తమ ఒరిజినల్ పాటగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మన జాతికి గర్వకారణమని అభినందించారు. అదేవిధంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరి తీరంలో ఆస్కార్ అవార్డు విజేతల సైకత శిల్పాన్ని రూపొందించారు. అకాడమీ అవార్డులు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్చిత్రంలోని ‘నాటు నాటు’ నృత్య చిత్రాన్ని, ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ లఘచిత్రంలోని గజరాజు శిల్పంతోపాటు మధ్యలో ఆస్కార్ ప్రతిమ ఉన్న ఆరడుగుల ఎత్తైన శిల్పాన్ని ఇసుకతో తయారుచేశారు. రెండు భారతీయ చిత్రాలకు అకాడమీ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. Congratulations! Proud moment for Indian Cinema!. While ‘#NaatuNaatu’ from #RRR wins the #Oscars for the Best Original Song, #TheElephantWhisperers wins the Oscars for Best Documentary Short Film at the #Oscar2023. My SandArt at Puri beach in Odisha in india. pic.twitter.com/UtrnYX8RNI— Sudarsan Pattnaik (@sudarsansand) March 13, 2023 కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్ ప్రదానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. -
సముద్రం ఒడ్డున సైకత చిత్రం.. సీఎం జగన్ నుంచి బిపిన్, లతామంగేష్కర్, మోదీ వరకు
ముఖ్య ఘటనలు జరగడం, ప్రత్యేక దినోత్సవం వచ్చిందంటే చాలు సింహపురి గడ్డపై సముద్రం ఒడ్డున సైకత చిత్రం వెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో మొదలుపెట్టి మొన్న భారతదేశ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, నిన్న గానకోకిల లతామంగేష్కర్ మరణం వరకు ఎందరో ప్రముఖుల సైకత చిత్రాలు సముద్రం ఒడ్డున వెలిశాయి. గడచిన పన్నెండేళ్లుగా 284 చిత్రాలను రూపొందించి ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులను అందుకున్నాడు మంచాల సనత్‌కుమార్. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సనత్‌కుమార్ బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నప్పుడు ఇసుకలో బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న సనత్ ఎదిగిన తర్వాత తన ఆలోచనలు సైకత చిత్రాల వైపు మళ్లాయి. జీవ వైవిధ్యం, సేవ్ ఓషన్, స్టాప్ టెర్ర రిజం, కాలుష్య నియంత్రణ, ఫ్లెమింగో పక్షుల సంరక్షణ...ఇలా అనేక సామాజిక స్పృహ కల్గించే సైకత చిత్రాలను రూపొందించాడు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైకతశిల్పాల రూపేణా వివరించాడు. ఎప్పటికైనా సైకత చిత్రాలు వేయడంలో అంతర్జాతీయ పోటీలలో పాల్గోని ప్రతిభ చూపెట్టాలనే లక్ష్యంతో పుష్కర కాలంగా సనత్‌కుమార్ పయనిస్తున్నాడు. విద్యార్థులకు సైకత చిత్రాలు వేయడంలో మెలకువలు నేర్పిస్తూ ఇప్పటి వరకు రెండు వేల మందికి ‘సాండ్ ఆర్ట్ ట్రైనింగ్’ ఇచ్చాడు. మైపాడు బీచ్‌లో 2017లో వంద మంది విద్యార్థులతో ఏకకాలంలో 1186 జాతీయ జెండా సైకత చిత్రాలను తయారు చేయించాడు. దాంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా సైకత శిల్పాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై నూతనశకం ఆరంభమంటూ (న్యూ ఎరా బిగినింగ్ ఇన్ ఎడ్యుకేషన్) సైకత చిత్రం వేశాడు. బతుకులు మార్చే గుడి అమ్మ ఒడి, రక్షాబంధన్ రోజున దిశాయాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ సైకత చిత్రాలు తయారు చేశాడు. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి, నెల్లూరు -
ఆకట్టుకుంటున్న సీఎం జగన్, దిశ యాప్ శైకత శిల్పాలు
సాక్షి, నెల్లూరు: ఆపదలో ఉన్న ఆడబిడ్డలకు సత్వర సాయం అందేందుకు తోడ్పడుతున్న దిశ యాప్‌పై ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ ప్రశంసలు కురిపించారు. రాఖీ పండగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, దిశ యాప్ శైకత శిల్పాలను ఆయన రూపొందించారు. దిశ యాప్ రూపకల్పనతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ భద్రత కల్పిస్తున్నారని, మహిళలపై జరిగే ఆటవిక చర్యలను ఈ యాప్ ద్వారా అరికట్టడం గొప్ప విషయమని సనత్ కుమార్ పేర్కొన్నారు. మహిళలందరికీ దిశ యాప్ రక్షా బంధన్ లాగా పనిచేస్తుందని తెలిపారు. -
HE IS LION: ఆకట్టుకుంటున్న సీఎం జగన్ సైకత శిల్పం
-
HE IS LION: ఆకట్టుకుంటున్న సీఎం జగన్ సైకత శిల్పం
సాక్షి, నెల్లూరు: సంక్షేమాన్ని అన్నివర్గాల చెంతకు చేరుస్తూ పేదల పెన్నిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారంటూ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సనత్ కుమార్ చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ విమర్శకులకు సింహస్వప్నంలా సీఎం జగన్ మారారనే సంకేతమిస్తూ ‘హి ఈజ్ లయన్’ పేరుతో సైకత శిల్పం రూపొందించినట్టు సనత్ చెప్పాడు. దార్శనికతను చాటుకుంటున్న సీఎం వైఎస్ జగన్ పాలనలో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు పురుడు పోసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. -
వైభవంగా ధ్వజారోహణం.. ఆకర్షిస్తోన్న సైకత శిల్పం
సాక్షి, తిరుమల : ఈ ఏడాది రెండు పర్వదినాలు ఒకే రోజున వచ్చాయి. వాటిలో విఘ్నాల్ని తొలగించి, విజయాల్ని అనుగ్రహించే దైవం వినాయకుని పుట్టినరోజు ఒకటి కాగా.. మరోటి ముక్కోటి దేవతలు, ముల్లోకాలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజే ప్రారంభమయ్యాయి. బ్రహ్మాత్సావాల్లో భాగంగా ఈ ఏడాది తొలి పూజలు గణనాథుడే అందుకున్నాడు. ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. తొలి ఉత్సవాలు నేడు ప్రారంభమవుతుండగా.. 20 రోజుల తేడాతో శరన్నవరాత్రి సందర్భంగా మరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 - 6. 30 గంటల ప్రాంతంలో మకర లగ్నంలో ధ్వజరోహణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ధ్వజ స్తంభంపై జెండాను ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామీవారు పెదశేష వాహనంపై ఊరేగుతారు. భక్తులను ఆకర్షిస్తోన్న సైకత శిల్పం బ్రహ్మోత్సవాల సందర్భంగా విష్ణుమూర్తి దశవతారాలలోని ఒక్కో అవతారాన్ని ఏడాదికి ఒకటి చోప్పున సైకత శిల్పంగా రూపొందించి ఉత్సవాలకు అదనపు హంగులు అద్దుతున్నారు మైసూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెళ్లల్లు. వారి వివరాలు.. కర్ణాటకకు చెందిన నీలాంభిక తన సోదరి గౌరితో కలిసి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్ల నుంచి పాప నాశనం వెళ్లే దారిలో ఫలపుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. టీటీడీ గార్డెన్ ఇన్చార్జ్ శ్రీనివాస్ సహకారంతో ఈ శిల్పాలను తయారు చేస్తున్నట్లు నీలాంభిక తెలిపారు. మూడు రోజులపాటు శ్రమించి ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికవరకూ వరాహ, ఉగ్ర నరసింహ, మత్స్య అవతారాలను సైకత శిల్పంగా చెక్కినట్లు తెలిపారు. ఈ ఏడాది వామన అవతారాన్ని రూపొందించామన్నారు. ఇందుకుగాను 9 టన్నుల ఇసుకను వాడినట్లు తెలిపారు. దేశం మొత్తం మీద ఇద్దరే... దేశంలో సైకత శిల్పాలను రూపొందిస్తున్న మహిళా కళాకారులు వీరిద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. వీరు మన దేశంలోనే కాక అరబ్ దేశంలో కూడా సైకత శిల్పాలాను రూపొందించినట్లు తెలిపారు. అరబ్ దేశంలో నిర్వహించే ఒంటేల పండుగ సందర్భంగా అరబ్ దేశాల సంస్కృతిని ప్రతిబింబించేలా సైకత శిల్పాలను రూపొందించినట్లు నీలాంభిక తెలిపారు. ఈ కళను నేర్చుకోవడం కోసం తాము ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని.. ఇంటర్నెట్లో చూసి ఈ సైకత శిల్పాలలను మలచడం నేర్చుకున్నట్లు నీలాంభిక తెలిపారు. -
స్నేహితుల దినోత్సవ సైకత శుభాకాంక్షలు
గార శ్రీకాకుళం : మండల పరిధిలోని పోర్టు కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నేహితుల దినోత్సవం పురస్కరించుకోని సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో అందరూ అభినందించారు. అంపోలు గ్రామానికి చెందిన దాకోజు లాలూప్రసాద్ స్నేహితులకు దోస్త్ అన్న పేరిట సైకత శిల్పాన్ని రూపొందించాడు. సాయంత్రం బీచ్‌కు వచ్చిన సందర్శకులు దీన్ని చూసి అభినందించారు. -
పూరి తీరంలో సైకత అద్భుతం!
సాక్షి, న్యూఢిల్లీ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని పూరి తీరంలో ఇసుకతో బుద్ధుని ప్రతిమను తయారు చేశారు. ‘ప్రపంచ శాంతిని కోరుతూ బోది చెట్టు కింద ప్రార్థన చేస్తున్న బుద్ధుడు’ సైకత శిల్పం ఫోటోలను పట్నాయక్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బుద్ధుని ఆశిస్సులతో ప్రపంచమంతా శాంతితో నిండిపోవాలని కాంక్షించారు. ‘అందరికీ హృదయపూర్వక బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’ అంటూ పట్నాయక్ బుద్ధ జయంతి సందర్భంగా గతంలో బెర్లిన్, జపాన్ సముద్ర తీరాల్లో తయారు చేసిన బుద్ధుని మంచు ప్రతిమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున జన్మించిన సిద్ధార్థుడు తన బోధనలతో, చేతలతో.. మనిషి దుఃఖానికి కారణమైన కోరికలను త్యజించి శాంతియుత జీవనాన్ని గడపాలని చాటిచెప్పారు. కాగా, బుద్ధుని జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మతస్తులు ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. My heartiest wish to all a Blessed and Peaceful life on #BuddhaPurnima. One of my SandArts pic.twitter.com/jFSDVhJl4Q — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my SandArts at Berlin in 2013 . pic.twitter.com/k6UDJsn2c6 — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my Snow sculpture at Japan in 2007 . pic.twitter.com/JxtDKJWqvj — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 -
సరికొత్త కళారూపం
కళకు ఎల్లలు లేవు. అది కళాకారుడి ఊహాశక్తికి సంబంధించిన విషయం. అందుకే తరాలు మారుతున్నకొద్దీ కళ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. ఆ రూపాలు కళను ప్రేమించేవారికి నిత్యనూతన ఆనందాన్ని...అందులోకి ప్రవేశించాలి అనుకునేవారిలో నిరంతర ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. గ్లిట్టర్ ఆర్ట్ గా పిలుచుకునే పెయింటింగ్ కళ కూడా ఇప్పుడు ఇదే వరుసలో ఉంది. కాన్వాస్ పై గమ్ తో మొత్తం పెయింటింగ్ వేసి...చూసే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తూ...చివర్లో ఆ కాన్వాస్ మీదికి రంగులు వెదజల్లడంతో కళారూపాన్ని ఆవిష్కరించడం సరికొత్త ప్రక్రియ. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ సాక్షి స్టూడియోలో రూపొందించిన అలాంటి ఒక కళారూపం మీరూ చూడండి.. -
కనకదుర్గ కళారూపం
-
మహిషాసురమర్దిని సైకత శిల్పం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున ఈ శిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ విజయవాడ ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిచూపుతున్నారు. బాలాజీ గతంలో వినాయచవితిని పురస్కరించుకుని శైవlగణనాథుడి సైకత శిల్పాన్ని రూపొందించి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల మన్ననలు అందుకున్నారు. -
శాండ్ ఆర్ట్‌లో వినాయక జన్మ చరిత్ర
-
సింధుకు శుభాకాంక్షలు తెలుపుతూ శాండ్ ఆర్ట్
-
అదరగొడుతున్న 'రాహుల్ - షారుక్' వీడియో
ముంబై: బాలీవుడ్ 'కింగ్ ఆఫ్ రొమాన్స్' షారూక్ ఖాన్ 50 ఏళ్ల జీవితంలో బాల్యం నుంచి మొదలు కొన్ని ముఖ్య ఘట్టాలను, సినీ ప్రస్థానాన్ని వినూత్నంగా చిత్రీకరించి ఓ అభిమాని షారూక్ ను ఉత్తేజితుడిని చేశాడు. శాండ్ ఆర్టిస్ట్ రాహుల్ ఆర్య ఆకర్షణీయమైన వీడియోతో షారూక్‌పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంటోంది. '50 ఇయర్స్ ఆఫ్ ఎస్ఆర్కె' పేరుతో 200 సెకండ్ల నిడివితో అద్భుతంగా ఉన్న ఈ వీడియోను చూసితీరాల్సిందే. బాలీవుడ్ బాద్షా షారూక్ తొలినాళ్లలో నటించిన 'ఫుజి' నుంచి తాజా చిత్రం 'ఫ్యాన్', ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న 'రయీస్' వరకు ఇసుక ఆర్ట్ తో కూడిన ఒక వీడియోను సృష్టించాడు. అటు హీరోని, ఇటు అభిమానులను.. ఇంకా పలువురిని మంత్రముగ్ధులను చేసిన ఈ వీడియో ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు రాహుల్ కళాత్మక వీడియోపై స్పందించిన షారూక్ కూడా రాహుల్ ని అభినందించాడు. ఈ వీడియో తన సింహావలోకనానికి ఉపయోగపడిందని... తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందంటూ ట్వీట్ చేశాడు. కాగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో బాగానే పాపులర్ అయింది. దీనిపై ఆయన అభిమానుల స్పందన భారీగానే ఉంది. 'ఫ్యాన్' సినిమాలోని గౌరవ్ ప్లేస్‌లో తనను రిప్లేస్ చేస్తూ ఓ అభిమాని ఫ్యాన్ ట్రైలర్ ను తిరిగి రూపొందించిన మరో ప్రయత్నం షారూక్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో ఆ యువకుడికి తన గ్రాఫిక్స్ విభాగంలో చేరమని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. Thank u. Makes me want to work harder when I see my life flashing past me and I still have enough to create more. https://t.co/XVILD0wicC — Shah Rukh Khan (@iamsrk) March 21, 2016 -
ఈసారి రైల్వే బడ్జెట్ పై
భువనేశ్వర్: 2016 సంవత్సరానికి గాను మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మాట ఎలా ఉన్నా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మాత్రం పలువురి ఆకట్టుకున్నారు. వివిధ సందర్భాలలో సైకత శిల్పాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆయన మరోసారి తన నైపుణ్యానికి పని చెప్పారు. సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌పై ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో పట్టాలు, రైలును ఇసుకతో చెక్కారు. దాని పక్కన ఇండియన్ లైఫ్ లైన్ బడ్జెట్ 2016 అని క్యాప్షన్ రాశారు. అనంతరం దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సమాజంలో ఆయా పరిస్థితులకు, పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత. ఇటీవల మంచుపర్వతాల్లో చిక్కుకున్న హనుమంతప్ప కోమాలోకి వెళ్లిన సందర్భంలో త్వరగా కోలుకోవాలంటూ తన సైకత శిల్పం ద్వారా ఆకాక్షించి పలువురి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. -
బీచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా కలాం రూపం
-
ఇసుకేస్తే రాలిన చిత్రాలు
మీ పేరు విభిన్నంగా ఉందే.. ఆ పేరుకి ఏమిటి అర్థం? అని అడిగితే ‘నా పేరు కాంత్.రిసా అనే పదం నచ్చి పేరుకి చివర తగిలించుకున్నా’నంటాడు. పెరిగిన గడ్డం, తలపాగాతో ఒక మతానికి చెందిన వ్యక్తిగా కనిపించే ఈ మూడుపదుల వయసున్న మహబూబ్‌నగర్ జిల్లా తెలుగు యువకుడు.. చిన్నప్పటి నుంచీ తలపాగా అలవాటనీ, ఇప్పటి దాకా గడ్డం, మీసం కత్తిరించిందే లేదనీ వివరిస్తాడు. నిన్నటికి విలువివ్వని,రేపనేది నమ్మనని, నేటిని మాత్రమే నిజమని భావిస్తాననే కాంత్‌రిసా.. వ్యక్తిగా విచిత్రుడు. గుప్పెడు ఇసుక రేణువుల సాక్షిగా.. గుర్తుండిపోయే కథలను గుప్పించే స‘చిత్ర’గుప్తుడు. ..:: ఎస్.సత్యబాబు ‘ఎక్కడ ఉంటారు అనడిగితే ఏం చెబుతా? ఇప్పుడిక్కడున్నా. రేపెక్కడుంటానో...’ అంటూ అర్థం కానట్టు మాట్లాడే కాంత్‌రిసా.. మాటలకీ చేతలకీ ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. రాష్ట్రంలో శాండ్ ఆర్ట్‌కి ఒక ప్రత్యేకమైన ఇమేజి తీసుకొచ్చిన ఆయన ఎక్కడుంటాడో తెలియకపోయినా.. ఆయన చేతిలో ఇసుక సంచీ నుంచి తమ కోసం ఒక చక్కని కథ నేల రాలుతుందని చాలా మందికి తెలుసు. బ్యూటీ ఆఫ్ బీయింగ్ స్పాంటేనియస్.. ‘ప్లానింగ్ అంటే ఇష్టం ఉండదు. ఏ ప్రదర్శనలో పాల్గొన్నా అప్పటికప్పుడు వాళ్లు చెప్పిన ఈవెంట్‌కు అనుగుణంగా స్టోరీ అల్లుకుని అక్కడ చిత్రరూపం ఇచ్చేస్తా. అంతే’ అని చెప్పారు కాంత్. జేఎన్టీయూ ఫైనార్ట్స్ విద్యార్థిగా డ్రాప్ అవుట్ అయిన ఆయన.. అనుకోకుండా ఇసుకతో వి‘చిత్రాల’ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా అలా ఇసుక చిత్రావళిని దేశవ్యాప్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే ఇసుక చిత్రాలతో కథలు చెప్పడం అనే అంశంలో తనదైన ప్రత్యేకతను సాధించారాయన. సిటీలో ఒకసారి హెమిటాలజీ మీద జరిగిన డాక్టర్ల సదస్సులో శాండ్ ఆర్ట్ ద్వారా మదర్ అండ్ చైల్డ్ని ప్రదర్శించారు. బిడ్డకు రక్తాన్ని పంచే తల్లి వ్యాధుల్ని పంచాలనుకోదు అంటూ సందేశాన్ని కూడా సంధించి, వినోదం కోసమే ఈ షో అనుకున్న అహూతులను విస్మయానందంలో ముంచారు. అయితే అవేవీ ముందస్తు ప్లాన్‌తో చేసినవి కావనీ, అప్పటికప్పుడు అల్లుకున్నవే అంటున్న కాంత్.. స్పాంటేనియస్‌గా జీవించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ తనకు కనపించదంటారు. శాండ్ త్రూ కొరియర్.. కార్పొరేట్ కంపెనీల కార్యక్రమాలు, సిటీ ఈవెంట్లు, కళాశాలలు, యూనివర్సిటీలు.. ఇలా కాంత్‌రిసా కాలు మోపని, ఇసుక రాల్చని వేదికలు లేవనే చెప్పాలి. కొన్నేళ్లుగా దేశ విదేశాల్లో శాండ్ ఆర్ట్‌ని ప్రదర్శిస్తున్న కాంత్... తన ప్రతి ప్రదర్శనకి కనీసం కిలోన్నర ఇసుక అవసరం అని చెప్పారు. రోడ్‌సైడ్ మట్టిని దోసిళ్లతో పోసుకుంటుంటే నవ్వే నోళ్లు, పిచ్చోడిని చూసినట్టు చూసేకళ్లు తననేమీ కదిలించలేవంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి ఆయన తీసుకెళ్లే ఇసుక సంచీ మీద ఎడతెగని సందేహంతో 4 గంటల పాటు శోధించారట.. ఈ అనుభవం తర్వాత ఇసుకని అవసరాన్ని బట్టి కొరియర్లో పంపుతున్నా అని చెప్పారాయన. ‘కొన్ని ‘షో’లకు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్లిన రోజులున్నాయి. డబ్బు ముఖ్యం కాదు. నా రోజువారీ అవసరాలు తీరిపోయిన తర్వాత నాకు డబ్బుతో పని ఉండదు. డబ్బు అనేదాన్ని జీవిత ప్రాధామ్యాల్లో నుంచి తీసేసి చూడండి. అప్పుడు ఎవరితోనైనా కలసి పనిచేయగలుగుతాం’ అంటారు కాంత్. ‘నా ఆర్ట్‌ని డస్ట్ ఆర్ట్ అనండి. శాండ్ ఆర్ట్ అనొద్దు. బియ్యపు పిండితో కూడా చిత్రాలు వేయవచ్చు. అవన్నీ మాధ్యమాలే తప్ప వాటి పేరుతో ఆర్ట్‌ని పిలవకూడదు’ అని సూచిస్తున్న ఈ వి‘చిత్ర’కారుడు త్వరలో ఒక సినిమా తీయబోతున్నాని చెబుతున్నాడు. అయితే అది హిట్టా ఫట్టా అని కాక తనకు నచ్చిన కోవలో తీస్తున్నానని, దాని ఫలితంతో తనకు పనిలేదని చెప్తున్న కాంత్‌రిసా దీనికి సిద్ధపడిన ఓ నిర్మాత కూడా దొరికాడన్నారు. ప్రస్తుతం జీవిస్తున్న క్షణ మే చివరిది అన్నట్టు ఉండడమే తనకు ఇష్టం అని చెప్పే కాంత్.. శాండ్‌తో మాత్రమే కాదు అన్ని రకాల చిత్రాలను గీయడంలో సిద్ధ‘హస్తులే’. -
షాండ్ ఆర్ట్
సైకత చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కళాకారుడు బి.హరికృష్ణ నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ నుంచి 2012లో బీఎఫ్ఏ పూర్తి చేశాడు. తన కళా సృజనలో ఎప్పటికప్పుడు సామాజిక పరిణామాలను స్పృశించే హరికృష్ణ, కళ ద్వారా కొంతవరకైనా సామాజిక పరివర్తన జరగాలనేదే తన ఆశయమంటాడు. విభిన్నమైన కళా రూపాన్ని ఎంచుకున్న హరికృష్ణ, వైవిధ్యభరితమైన అంశాలను ఎంపిక చేసుకోవడం విశేషం. తన విలక్షణ ప్రతిభతో హరికృష్ణ భారత విదేశాంగ శాఖ సౌజన్యంతో గూగుల్ ఇండియా నిర్వహించిన ‘యూట్యూబ్ గ్లోబల్ వీడియో చాలెంజ్-2012’ పోటీలో విజేతగా నిలిచాడు. అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఐదు నిమిషాల్లోనే భారత్ ఘనతను చాటే వీడియోను రూపొందించడం ఈ పోటీలోని అంశం. ‘నిర్భయ’ సంఘటనపై సైకత చిత్రాలతో రూపొందించిన వీడియోను ఫేస్బుక్లో పెడితే తిలకించిన ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, హరికృష్ణను ‘జీ సరిగమప’ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. హరికృష్ణ వీడియోను ప్రదర్శిస్తూ, శంకర్ మహదేవన్ పాట పాడారు. పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధగల హరికృష్ణ తమ కాలనీ వందకు పైగా మొక్కలను నాటడం, వినాయక చవితి వేడుకల కోసం ఏడడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు. - సిద్ధాంతి


