మహిషాసురమర్దిని సైకత శిల్పం | mahishasuramardini Sand sculpture | Sakshi
Sakshi News home page

మహిషాసురమర్దిని సైకత శిల్పం

Oct 9 2016 8:56 PM | Updated on Aug 28 2018 8:41 PM

మహిషాసురమర్దిని సైకత శిల్పం - Sakshi

మహిషాసురమర్దిని సైకత శిల్పం

దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్‌ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్‌ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు.

మచిలీపట్నం (కోనేరు సెంటర్‌) : దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్‌ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్‌ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున ఈ శిల్పాన్ని ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ విజయవాడ ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిచూపుతున్నారు. బాలాజీ గతంలో వినాయచవితిని పురస్కరించుకుని శైవlగణనాథుడి సైకత శిల్పాన్ని రూపొందించి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల మన్ననలు అందుకున్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement