
సంక్షేమాన్ని అన్నివర్గాల చెంతకు చేరుస్తూ పేదల పెన్నిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారంటూ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సనత్ కుమార్ చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.
సాక్షి, నెల్లూరు: సంక్షేమాన్ని అన్నివర్గాల చెంతకు చేరుస్తూ పేదల పెన్నిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారంటూ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సనత్ కుమార్ చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ విమర్శకులకు సింహస్వప్నంలా సీఎం జగన్ మారారనే సంకేతమిస్తూ ‘హి ఈజ్ లయన్’ పేరుతో సైకత శిల్పం రూపొందించినట్టు సనత్ చెప్పాడు. దార్శనికతను చాటుకుంటున్న సీఎం వైఎస్ జగన్ పాలనలో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు పురుడు పోసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు.