నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు | YSRCP formation celebrations today | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Mar 12 2026 4:32 AM | Updated on Mar 12 2026 4:32 AM

YSRCP formation celebrations today

వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ    

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగుల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌పీపీ  కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా పార్టీ పతాకాలు ఎగుర వేయాలని కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో నేతలు, అభిమానులు, కార్యకర్తలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement