
World Elephant Day 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ పూరీ సాగర తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్దాడు. ఈ సందర్భంగా గజరాజుల సంరక్షణ కోసం ఏనుగుల ఆవాస అటవీ ప్రాంతాలను పరిరక్షించడం బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. – భువనేశ్వర్/పూరీ
ప్రతీ ఆగస్టు 12న, ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్షణం ఏనుగులు గురించి ఆలోచించే రోజు.. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. అత్యంత అసాధారణ జంతువులలో ఒకదైన గజరాజును రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే ప్రపంచవ్యాప్త పిలుపు.
ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?
ఈ రోజు 2012లో ప్రారంభమైంది. కెనడియన్ చిత్రనిర్మాత ప్యాట్రిసియా సిమ్స్, థాయిలాండ్‌కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్‌తో కలిసి, విలియం షాట్నర్ కథనం ప్రకారం రిటర్న్ టు ది ఫారెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైన తర్వాత దీనిని మొదలు పెట్టారు.