గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసన | Ysrcp Protest In Front Of Visakhapatnam Gitam University | Sakshi
Sakshi News home page

గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసన

Apr 22 2026 4:37 PM | Updated on Apr 22 2026 4:41 PM

Ysrcp Protest In Front Of Visakhapatnam Gitam University

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.

గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement