Live Updates
మానవత్వం ఉందా.. కోటి పరిహారం ఇవ్వాల్సిందే: వైఎస్ జగన్
అధికారులు వెంటనే స్పందిస్తే మత్స్యకారులు బతికేవాళ్లు: వైఎస్ జగన్
- వైఎస్ జగన్ కామెంట్స్..
- ఈనెల ఒకటో తేదీన ఏడుగురు వేటకు వెళ్లారు.
- నాలుగో తేదీన ప్రమాదం జరిగింది.
- ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?
- కేవలం పది మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది.
- జూలై నాలుగో తేదీన చిన్నా ఫోన్ చేసి ఇంటికొస్తున్నామని చెప్పాడు.
- దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన కాసేపటికే ప్రమాదం జరిగింది.
- ఫిషరీస్ అధికారులు కూడా స్పందించలేదు.
- బోటు ప్రమాదం జరిగిందని అధికారులకు మెసేజ్ చేశారు.
- రాత్రి 10:30 గంటలకు కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టారు.
- అప్పుడే వెంటనే స్పందించి ఉంటే మత్స్యకారులు దొరికేవారు.
- వెంటనే కోస్ట్‌గార్డ్ వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు.
- ఈనెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారు.
- తప్పు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు.
- త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పులతడక.
- ప్రభుత్వానికి మానవత్వం ఉందా?.
- ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా రాలేదు.
- ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు.
- బాధితులను ఫిషరీస్ మంత్రి కూడా పరామర్శించలేదు.
- బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా?.
- సీఎం పట్టించుకోలేదు.. హోం మంత్రి పరామర్శించలేదు.
- రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు.
- ఎక్స్‌గ్రేషియా కింద అరకొర సాయం చేశారు.
- బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
- ఏడుగురు మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందాలి.
- మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా.. మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం.
- మా ప్రభుత్వంలో మత్స్యకారులకు భరోసా ఉండేది.
- 2018 పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాట నెరవేర్చాం.
- పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులను తీసుకొచ్చాం.
- మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్‌లకు శ్రీకారం చుట్టాం.
- మరో ఆరు ఫిష్ ల్యాండ్ పనులు కూడా చేపట్టాం.
2026-07-14 13:40:51
వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేది: బాధితులు
- జబ్బర్‌తోటలో వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు తమ కష్టాలను వివరించిన మత్స్యకారులు.
- బోటు ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.
- మత్స్యకారుల గల్లంతుపై సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితుల ఆవేదన.
- ఘటన జరిగిన వెంటనే ఏ అధికారీ రాలేదన్న మత్స్యకారులు.
- వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేదన్న బాధిత కుటుంబాలు.
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆరుగురు గల్లంతు అని ఆవేదన.
2026-07-14 13:00:06
బాధితులకు ధైర్యం చెప్పిన జగన్..
- బాధితులకు ధైర్యం చెప్పిన జగన్..
- బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు.
- సురక్షితంగా బయటపడ్డ చిన్నాకు వైఎస్ జగన్ పరామర్శ.
- బోటు ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న జగనన్న.
- వైఎస్ జగన్‌కు తమ కష్టాన్ని చెప్పుకున్న మత్స్యకారులు.
- మత్స్యకార కుటుంబాలను ఓదార్చిన వైఎస్ జగన్.
- బాధితులకు ధైర్యం చెప్పిన జగన్.
2026-07-14 12:45:16
మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్..
- జబ్బర్‌తోటకు చేరుకున్న వైఎస్ జగన్.
- జనసంద్రంగా మారిన విశాఖ నగరం.
- వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు.
- జనాలతో కిక్కిరిసిపోయిన విశాఖ సౌత్ నియోజకవర్గ వీధులు
- జబ్బర్‌తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్.
- సురక్షితంగా బయటపడిన చిన్నాను పరామర్శించిన జగన్.
2026-07-14 12:41:42
జనసంద్రంగా విశాఖ ఎయిర్‌పోర్టు..
- జబ్బర్‌తోటకు బయలుదేరిన వైఎస్ జగన్
- విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం.
- విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో జబ్బర్‌తోటకు బయలుదేరిన వైఎస్ జగన్
- వైఎస్ జగన్ రాకతో ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
- వైఎస్ జగన్ రాకతో జనసంద్రంగా విశాఖ ఎయిర్‌పోర్టు.
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్.
- ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన వైఎస్ జగన్
- కాన్వాయ్ దిగి ప్రజా సమస్యలు విన్న వైఎస్ జగన్.
- ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బాధితులకు భరోసా ఇచ్చిన జగన్.
2026-07-14 11:46:59
- విశాఖపట్నం..
- విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
- కాసేపట్లో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను కలవనున్న జగన్
- ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించనున్న జగన్
2026-07-14 11:17:28
యాక్షన్ చేస్తే రియాక్షన్ ఉంటుంది..
- గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కామెంట్స్..
- మమ్మల్ని ఇబ్బంది పెడితే.. భవిష్యత్‌లో మీరు ఇబ్బంది పడతారు..
- జగన్ అంటే జనం..
- పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఉంటుంది..
- బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు..
2026-07-14 11:09:32
ఎంత అడ్డుకున్నా జనం ఆగరు..
- విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కామెంట్స్..
- ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆంక్షలు పెట్టారు.
- పోలీసులు కూటమి ప్రభుత్వానికి బానిసల్లా పని చేస్తున్నారు..
- అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్..
- ఎంత అడ్డుకున్నా జనం ఆగరు.
- జగన్ రాకతో కూటమి నేతల్లో వణుకు ప్రారంభమైంది.
2026-07-14 11:06:19
జగన్ వస్తున్నారని భయమా?: కరణం ధర్మశ్రీ
- మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కామెంట్స్..
- మత్స్యకారులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారు..
- జగన్ వస్తున్నారని పోలీసులు ఎయిర్‌పోర్టులో ఆంక్షలు పెడుతున్నారు..
- ఇది దుర్మార్గపు ప్రభుత్వం..
- ప్రభుత్వం నుంచి బాధిత మత్స్యకారులను ఎవ్వరూ పరామర్శించలేదు.
2026-07-14 10:50:30
వైఎస్ జగన్ రాక.. ఎయిర్‌పోర్టులో పోలీసుల ఓవరాక్షన్!
- పోలీసుల ఆంక్షలు వలయంలో వైజాగ్ ఎయిర్‌పోర్ట్..
- వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులు..
- వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.
- పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు..
2026-07-14 10:30:06
విశాఖ బయల్దేరిన వైఎస్ జగన్
- జబ్బర్‌తోటలో మత్స్యకారుల నివాసాలకు వెళ్లనున్న వైఎస్ జగన్
- బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
- సురక్షితంగా బయటపడ్డ కారె చిన్నాను పరామర్శించనున్నవైఎస్ జగన్
2026-07-14 09:40:54
కాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్
- కాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్
- బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ
2026-07-14 08:49:44
నేడు విశాఖకు వైఎస్ జగన్
- నేడు విశాఖకు వైఎస్ జగన్
- బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ
- ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా కలవనున్న వైఎస్ జగన్.
2026-07-14 08:20:25
Advertisement



