రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం | Key Development In The Radha Gayatri Case | Sakshi
Sakshi News home page

రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం

Jun 26 2026 4:53 PM | Updated on Jun 26 2026 5:36 PM

Key Development In The Radha Gayatri Case

సాక్షి, విశాఖపట్నం: రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింహాచలంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీచరణ్ కుటుంబ సభ్యులను నిలదీసిన రాధా గాయత్రి కుటుంబ సభ్యులు.. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమె తల్లి పట్టుబట్టింది. శ్రీచరణ్ ముస్సోరి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ గాయత్రి పెద్ద కర్మ వేదికగా వివాదం రాజుకుంది.

శ్రీచరణ్‌ తల్లిదండ్రులను రాధాగాయత్రి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుముట్టారు. శ్రీచరణ్‌ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. శ్రీచరణ్‌ వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని రాధా గాయత్రి బంధువులు తేల్చి చెప్పారు. అందరి సమక్షంలో శ్రీచరణ్‌కు బంధువులు కాల్‌ చేయించగా.. ముస్సోరిలో విచారణాధికారిని కలిసిశానంటూ శ్రీచరణ్‌ చెప్పాడు. ఎంక్వైరీ ఆఫీసర్‌కు స్పాట్‌లోనే బంధువులు కాల్‌ చేయగా.. ఇంతవరకు శ్రీచరణ్‌ తనను కలవలేదంటూ విచారణాధికారి చెప్పినట్లు సమాచారం.

కాగా,ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు కూడా నమోదు చేశారు. రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement