విశాఖపట్నం : సింహాచలం చందనోత్సవ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికార యంత్రాంగం సమన్వయలోపం వెరసి వేలాది భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
రద్దీ లేని సమయంలో తీరుబడిగా ఉన్న అధికారులు.. అసలు సమయం వచ్చేసరికి ఓ దశలో పూర్తిగా చేతులెత్తేశారు.
దీంతో భక్తులు సోమవారం సాయంత్రం పడరాని పాట్లు పడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. మెట్ల మార్గం.. ఘాట్ రోడ్లు మీదుగా కిలో మీటర్ల మేర కొండ ఎక్కి అంత్యంత గందరగోళ పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకున్నారు.


