‘బీఆర్‌ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’ | Varudu Kalyani Fires On Br Naidu And Chandrababu | Sakshi
Sakshi News home page

‘బీఆర్‌ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’

Mar 22 2026 5:54 PM | Updated on Mar 22 2026 5:54 PM

Varudu Kalyani Fires On Br Naidu And Chandrababu

సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్‌ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్‌గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. బీఆర్‌ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్‌లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.

‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్‌ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు.

 



 

Advertisement
 
Advertisement
Advertisement