ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన | Heavy Rain Alert Issued for Several Districts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Jun 11 2026 3:17 PM | Updated on Jun 11 2026 7:02 PM

Heavy Rain Alert Issued for Several Districts in Andhra Pradesh

విశాఖ :  ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.  

భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా  50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement