26 నుంచి జాతీయ ఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

26 నుంచి జాతీయ ఆర్చరీ పోటీలు

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

26 నుంచి జాతీయ ఆర్చరీ పోటీలు

పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో నేషనల్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో శుక్రవారం ఈ పోటీలకు ప్రచార పోస్టర్లను వాసిరెడ్డి విద్యాసాగర్‌, ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ చైర్మన్‌ చెరుకూరి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ... అండర్‌ 15, 13 (ఓపెన్‌) విభాగాలలో ఇండియన్‌ రౌండ్‌, కాంపౌండ్‌, రికర్వ్‌ విభాగాలలో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 3 వేల మంది బాల బాలికలు, 300 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. ప్రో చాన్సలర్‌ వాసిరెడ్డి మహదేవ్‌ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పోటీలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బి.వి. రమణ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై. మల్లికార్జునరెడ్డి, వీవీఐటీయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement