వ్యాక్సిన్‌ వచ్చిందోచ్‌..! | - | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ వచ్చిందోచ్‌..!

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

వ్యాక్సిన్‌ వచ్చిందోచ్‌..! ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చెక్‌ ● జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్ల వయస్సున్న బాలికలు 22,400 మంది ఉండొచ్చని వైద్యాధికారులు అంచనా వేశారు. అందుకోసం 7,793 వెయిల్స్‌ను జిల్లా వైద్యాధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 83 కోల్‌చైన్‌ సెంటర్స్‌ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి, గుంటూరు జీజీహెచ్‌కు పంపిణీ చేశారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి సుమారు 90 నుంచి 100 వెయిల్స్‌ పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ● గత ఏడాది నవంబర్‌ 14న నాన్‌ కమ్యూనకబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ 4.0) కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు దాటిన మహిళలకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓరల్‌ క్యాన్సర్‌ (నోటి క్యాన్సర్‌) బాధితులు 247 మంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితులు (రొమ్ము క్యాన్సర్‌) 620 మంది, సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులు (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌) 347 మంది ఉన్నట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. ● సర్వైకల్‌ క్యాన్సర్‌ సోకడానికి ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ). ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్‌ ముప్పును పెంచుతుంది.

నేటి నుంచి ఉచితంగా టీకా

తొలుత 14 ఏళ్ల బాలికలకు...

జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు

అక్కలారా..అమ్మలారా
ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చెక్‌

గుంటూరు మెడికల్‌: క్యాన్సర్‌ కేసులను ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను తగ్గింపు చేసి మరణాలు నివారించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సర్వైకల్‌ క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ అందజేస్తుంది. ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నారు. కేవలం 14 ఏళ్ల వయస్సున్న బాలికలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేసేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు రంగం సిద్ధం చేశారు.

ఒక పక్క స్క్రీనింగ్‌... మరో పక్క వ్యాక్సిన్‌....

కారణాలు.....

బాలికల సంఖ్య 22,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement