నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల శ్రీనివాస వైభవోత్సవాలు ప్రారంభం శ్రీరంగనాయకులు అలంకారంలో నరసింహస్వామి రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు ధ్వంసం

నూజండ్ల:మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో శుక్రవారం కోటిగట్ల ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించనున్నారు. తిరునాళ్ల సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మొక్కుబడి ప్రభను ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులంతా ఐకమత్యంతో తిరునాళ్లను జరుపుకోవటం ఆనవాయితీ. నూజండ్ల, రెడ్డిపాలెం, దాట్లవారిపాలెం, మారెళ్లవారిపాలెం, తలార్ల పల్లె, అప్పాపురం తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులుపాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలిపారు.

రేపల్లె: బాపట్ల జిల్లా మైనేనివారిపాలెం గ్రామంలోని శ్రీ గురు నిలయంలో శ్రీగాయత్రీ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామికి సుప్రభాత సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని, దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మంగళగిరిటౌన్‌: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీ రంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా కొడాలి సీతారామయ్య, బసవానంద్‌, వెంకట అజయ్‌లు, ఆస్థాన కై ంకర్యపరులుగా పచ్చళ్ల విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు.

నకరికల్లు: ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన మండలంలోని చల్లగుండ్ల వద్ద అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం జరిగింది. ఎస్‌ఐ కె.సతీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ వైపు నుంచి కోడిగుడ్లు లోడుతో లారీ చెన్నయ్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో చల్లగుండ్ల వద్ద రోడ్డు పక్కన ఆపి డ్రైవర్‌ వంట చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వస్తున్న కంటైనర్‌ లారీ వేగంగా ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ హైవే పక్కన ఉన్న పొలాలలో బోల్తా పడింది. దీంతో లారీలోని సుమారు రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement