నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ పాలకవర్గం ఐదేళ్ల కాల పరిమితి ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.
తెనాలికి జేసీ...
తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవను నియమించారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17తో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. ఆరు నెలలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు జేసీ ఈ పదవిలో ఉంటారని తెలిపారు.


