కుటుంబంలో సప్త స్వరాలు | - | Sakshi
Sakshi News home page

కుటుంబంలో సప్త స్వరాలు

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 7:50 AM

కుటుంబంలో సప్త స్వరాలు

సప్త స్వరాలకు జీవన పయనానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. మాది సంప్రదాయ సంగీత కుటంబం. అమ్మ లలితకు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆమె వీణ, వయోలిన్‌, గాత్రంలో అద్భుత ప్రతిభాపాటవాలు పొందారు. ఇప్పటికీ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పిస్తుంటారు. ఆమె స్ఫూర్తితో నేను వయోలిన్‌, వీణ, గాత్రంలో మూడు డిప్లమోలు పూర్తి చేశాను. నేను, అక్క సరస్వతి విఘ్ణుభట్ల సంగీత సిస్టర్స్‌గా పేరుగాంచాం. నా కుమార్తె ఐఐఎంలో ఎంబీఏ చేసినా సంగీతంలో అద్భుతమైన పట్టు ఉంది. సంగీతం మాకు అద్భుత జీవితాలను ప్రసాదించిందంటే అతిశయోక్తి కాదు. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు చేసిన సాధన ఎంతో ఉపకరించింది. ముఖ్యంగా మేము రాణించడంలో ప్రతిభతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సీ్త్ర ఒక్క విషయం గుర్తించాలని నా మనవి. స్వేచ్ఛ పేరుతో చేసే విశృంఖలం ఎప్పటికీ మంచిది కాదు. అది చివరకు తననే దహిస్తుంది. సమాజంలో చులకన చేస్తుంది. నిత్యం గమనించుకుంటూ ముందుకు సాగాల్సిందే. తెలీక జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళపైనే ఉంటుంది.

–కృష్ణవేణి విష్ణుభట్ల, ప్రిన్సిపల్‌,

డాక్టర్‌ బాలమురళీకృష్ణ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ డ్యాన్స్‌, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement