సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 7:50 AM

సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు వైభవంగా హనుమాన్‌ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు వటపత్ర అలంకారంలో నారసింహుడు గ్రేడ్‌–2 హెచ్‌ఎం సీనియార్టీ జాబితా విడుదల

గుంటూరుఎడ్యుకేషన్‌: సమాజాభివృద్ధిలో మహిళలు కీలకంగా మారారని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం గర్వకారణమని జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళ్ళగలుగుతున్నారంటే అది వారికున్న ఆత్మ విశ్వాసమన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్‌ కృష్ణ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. మైహోం గ్రూప్స్‌ అధినేత శ్రీమాన్‌ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ఆంజనేయుని అనుగ్రహాన్ని, శ్రీస్వామి వారి మంగళశాసనాలని పొందారని పేర్కొన్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్‌ చాలీసా పారాయణ, అఖండ హరేరామనామ సంకీర్తన, హనుమద్‌ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

మంగళగిరి టౌన్‌: మంగ ళాద్రిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు వటపత్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించగా, అలంకార ఆస్థాన కై ంకర్యపరులుగా హైదరాబాద్‌కు చెందిన మేళ్లచెరువు సీతామహాలక్ష్మి వ్యవహరించారు.

గుంటూరుఎడ్యుకేషన్‌: జోన్‌–3 పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టులకు అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్‌ సైట్‌లో ఉంచినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు.

హెచ్‌టీటీపీఎస్‌://డీఈఓగుంటూరుబ్లాగ్‌స్పాట్‌.కామ్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ప్రకాశంస్కూల్‌ఈడీయూ.కామ్‌, హెచ్‌టీటీపీఎస్‌://డీఈఓనెల్లూరు.50వెబ్స్‌.కామ్‌ లో ఉంచిన సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఈనెల 13లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement