● రాణిస్తున్న మహిళామణులు
● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
గుంటూరు వెస్ట్: ప్రముఖ దర్శకుడు బాపు ఒకాకొన సందర్భంలో సీ్త్ర గురించి చెప్పమన్నప్పుడు సీ్త్ర, పురుషుడు సమానమే. అయితే సీ్త్ర కొంచెం ఎక్కువ సమానం అంటూ మహిళల పట్ల ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. సీ్త్ర, పురుషుడు సమానమా... అయితే ఎలా అవుతారు. అల్లారు ముద్దుగా పెంచిన ఇంటిని, తన పరివారాన్ని ఒక్క బంధం కోసం వదులుకుని సర్వస్వం త్యాగం చేయడంలోనా... సీ్త్ర తన ప్రాణాలను పలుమార్లు ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనివ్వడంలోనా. రక్త మాంసాలు పాలుగా మార్చి పిల్లలను పెంచుతూ మురిసిపోవడంలోనా... బిడ్డల్ని పెంచే క్రమంలో తన ఆకారాన్ని పూర్తిగా కోల్పోవడంతోపాటు ఎన్నో సంతోషాలను ఫణంగా పెట్టడంలోనా. దేన్లో పురుషుడికి సీ్త్ర సమానం. సీ్త్ర అన్నింట్లోనే అగ్రగణ్యమే వహిస్తుంది. అందుకే భగవంతుడు తనకు మారుగా ప్రతి ఇంటిలోనూ సీ్త్రని పుట్టించాడంటారు. ఆమెను ఆదిపరాశక్తిగా మన సమాజం పూజిస్తోంది. చిన్న చిన్న సంఘటనలు ఎన్ని జరిగినా సీ్త్ర ఔన్నత్యం దేదీప్యమానంగా పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఆధునిక సమాజంలో సీ్త్ర పాత్ర కాలాణుగుణంగా మారుతూ వస్తుంది. ఇంటా బయటా ఆమె పాత్ర ఎంత చెప్పినా తక్కువే. అణువు నుంచి ఆకాశం వరకు మహిళలు దూసుకుపోతున్నారు. మహిళలు ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వెనుకడుగు వేయడంలేదు. ప్రతి మనిషికి అవరోధాలు తప్పవు. దాని కోసం భవిష్యత్తును ఫణంగా పెట్టకూడదనే భావనతో రాణిస్తున్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తూ, సహచర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న కొందరు అధికారుల అభిప్రాయాలు....


